Home » నాగబాబు కామెంట్స్ పై తమ్మారెడ్డి ఏమన్నారో తెలుసా ?

నాగబాబు కామెంట్స్ పై తమ్మారెడ్డి ఏమన్నారో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

పాన్ ఇండియా చిత్రం RRR  ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని.. దీంతో 8 సినిమాలు చేయవచ్చు అని సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విధితమే.

Advertisement

అయితే తమ్మారెడ్డి భరధ్వాజ పై రాఘవేంద్రరావు, మెగా బ్రదర్ నాగబాబు స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. ఇక నాగబాబు అయితే.. నీయమ్మా మొగుడు ఖర్చు చేశాడా రూ.80కోట్లు అంటూ ఘాటు పదజాలంతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై తమ్మారెడ్డి భరద్వాజ్ రియాక్ట్ అయ్యారు. 

Also Read :  పెరిగిన ఎన్టీఆర్ ఆస్తుల విలువ.. 2023 లెక్కల ప్రకారం ఎంతో తెలుసా ?

“ నేను సెమినార్ లో పాల్గొని యంగ్ డైరెక్టర్స్ తో దాదాపు 3 గంటల పాటు మాట్లాడాను. అందులో ఒక నిమిషం క్లిప్ మాత్రమే విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి అందులో చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్ పై మాట్లాడాను. కొందరూ దీనిపై కామెంట్స్ చేయడం చాలా బాధకరం. ఒకరు అకౌంట్స్ అడుగుతారు. మరొకరు మరోటి అంటారు. వీటన్నింటిని వింటుంటే చాలా బాధగా, అసహ్యంగా ఉంటుంది. వారి సంస్కారం వాళ్లది నా సంస్కారం నాది. ఎవరెవరు ఎవరెవరినీ ఏ అవార్డుల కోసం ఏం అడుక్కుననారో ఏ పదవుల కోసం ఏం అడుక్కున్నారో ఎవడెవడి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు.

Advertisement

Also Read :  సరికొత్త హంగులతో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారంటే..?

ఒకడు అయితే నీయమ్మా మొగుడు అని అంటాడు.. మా అమ్మ మొగుడు నాకు మర్యాద, సంస్కారం నేర్పించాడు. నీతిగా బతకడం నేర్పించాడు. కులాలు, మతాల గురించి మాట్లాడే మీరా నా గురించి మాట్లాడే వారు. ఇప్పటికీ నేను ఇంకా ఏమైనా మాట్లాడాలంటే సంస్కారం అడ్డు వస్తుంది. నేను చాలా మాట్లాడవచ్చు. నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి రాజేష్ టచ్ రివర్ అనే దర్శకుడికి సంబంధించిన సెమినార్ జరుగుతుంటే.. మేము 3 గంటల పాటు కూర్చున్నాం. మూడు గంటల్లో కేవలం ఒకటి ఎడిట్ చేసి పెట్టేస్తే దానిని చూసి మీరు ట్వీట్ చేసి తిట్టేస్తే అయిపోతుంది. నన్ను తిట్టిన వారికి సిగ్గు ఉండాలి. నేను ఏం తప్పు చేయలేదు. ఇండస్ట్రీ అంతా ఒకటే అని.. మనమంతా ఒకటే అని ఇంతకాలం ఫీల్ అయ్యాను. ఇప్పుడూ ఫీల్ అవుతున్నాను. కొద్ది రోజుల ముందు నేను రాజమౌళిని అభినందిస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేశాను. ఆర్ఆర్ఆర్ భారతదేశానికి గర్వకారణం అని చెప్పాను. అది ఎవరు చూశారో తెలియదు. కానీ ఈ వీడియోని మాత్రం చూసి కామెంట్స్ చేస్తున్నారు” అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. 

 Also Read :  నరేష్-పవిత్ర పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా ? 

Visitors Are Also Reading