Home » బాలకృష్ణని దర్శకుడు అనిల్ రావిపూడి అంతలా మార్చేశాడా ?

బాలకృష్ణని దర్శకుడు అనిల్ రావిపూడి అంతలా మార్చేశాడా ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు బాలకృష్ణ, అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భగవంత్ కేసరి అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మాస్ కి బ్రాండ్ నేమ్ అయిన బాలకృష్ణల కాంబినేషన్ కావడంతో సినిమాపై అనౌన్స్ చేసిన నాటి నుంచి ఆడియోన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పాటు ఎమోషనల్ ఎంటర్టైన్ మెంట్స్ ఎలిమెంట్స్ కూడా ఉండేవిధంగా ప్లాన్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా సెట్స్ లో బాలయ్య బిహేవియర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

Advertisement

సాధారణంగా బాలయ్య చాలా సరదాగా గడుపుతుంటారు. బాలయ్యలో ఈ మార్పుకు కారణం దర్శకుడు అనిల్ రావిపూడి అని యూనిట్ చెబుతున్నారు. భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందని.. డ్యాన్స్ తో పాటు యాక్షన్ సీక్వన్స్ లో కూడా కనిపించనుందని సమాచాం అందుతోంది. మొత్తానికి.. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి బాలయ్య సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండనుందట. ఈ మూవీ బాలయ్య కి మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు

 సినిమా షూటింగ్ సమయంలో క్లాప్స్ ఎందుకు కొడతారో తెలుసా ?

ఆ దర్శకునితో హీరోయిన్ సమంత రిలేషన్ షిప్ ?

Visitors Are Also Reading