Home » ఆ దర్శకుడితో ఈ హీరోయిన్ రహస్య పెళ్లి.. ఆ నటి వ్యాఖ్యలు వెనక్కి..!

ఆ దర్శకుడితో ఈ హీరోయిన్ రహస్య పెళ్లి.. ఆ నటి వ్యాఖ్యలు వెనక్కి..!

by Anji
Ad

మారి మూవీతో పాటు పలు సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలాజీ మోహన్. అయితే ఈ దర్శకుడు ఇదివరకే ధన్య బాలకృష్ణను పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ విషయంపై వివాదస్పద నటి కల్పిక గణేష్ మాట్లాడారు. ధన్య బాలకృష్ణ-బాలాజీ మోహన్ లు పెళ్లి చేసుకున్నారని.. వీరిద్దరూ రహస్యంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడింటి. తొలుత ధన్య బాలకృష్ణ, బాలాజీ మోహన్ లు తమ పెళ్లి వార్తలను కొట్టి పారేశారు. 

Advertisement

కానీ ఆ తరువాత కొద్ది రోజులకే వారే ఔను.. తాము పెళ్లి చేసుకున్నామంటూ ప్రకటన చేశారు. తమ వ్యక్తిగత విషయాలను బయటికి లాగి ఇష్టానుసారంగా తమ గురించి విమర్శలు చేసిన కల్పికపై బాలాజీ మోహన్ పరువు నష్టం కేసు వేశాడు. ఆ కేసు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఈ కేసు విషయంలో రాజీకి వచ్చేందుకు ఇరు వర్గాల వారు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల బహిరంగంగా కల్పికా క్షమాపణలు కూడా చెప్పింది. దీంతో బాలాజీ మోహన్ తాను పెట్టిన పరువు నష్టం కేసును వెనక్కి తీసుకున్నాడట.

Advertisement

సోషల్ మీడియాలో కల్పికా షేర్ చేసినటువంటి క్షమాపణ వీడియోని అదేవిధంగా కొనసాగించాలని.. ఆ వీడియోను డిలీట్ చేయకూడదని.. ఒక వేళ చేసినట్టయితే కఠిన చర్యలుంటాయని కోర్టు ఆదేశించింది. బాలాజీ మోహన్, ధన్యబాలకృష్ణలకు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొంది. ఇక నుంచి ఎప్పుడూ కూడా బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదు అని.. అసత్య మాటలు మాట్లాడను అంటూ కల్పిక తన క్షమాఫన వీడియోలో వెల్లడించింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సలార్ టీజర్ సమయం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా ? 

ఆ హీరోయిన్ కోసం సోనుసూద్ స్పెషల్ దోసెలు.. అభిమానులు ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading