Home » సలార్ టీజర్ సమయం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా ? 

సలార్ టీజర్ సమయం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అనౌన్స్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్షేషన్ గా మారింది. జూన్ 06న ఉదయం 5:12 నిమిషాలకు టీజర్ విడుదలవుతుందంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది చిత్ర యూనిట్. సాధారణంగా టీజర్, ట్రైలర్ వంటి అప్డేట్స్ సాయంకాలం సమయంలో వస్తుంటాయి.  

Advertisement

కానీ ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీజర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉదయం వేళలో అనగా అప్పుడే తెల్లవారుతుంటేనే వస్తుండటంతో సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సమయానికి పెద్ద కథ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికొస్తే.. కేజీఎఫ్ ఛాప్టర్ 2లో రాఖీభాయ్ క్లైమాక్స్ సముద్రంలో కనిపించకుండా వెళ్లే సమయం కూడా 5:12 నిమిషాలుంటుంది. ఇప్పుడు సలార్ టీజర్ విడుదల సమయం కూడా అదే ఉండటంతో కేజీఎఫ్ కి సలార్ మూవీకి ఏమైనా లింక్ ఉందా..? అనే వార్తలు వాస్తవమే అని పేర్కొంటున్నారు.

Advertisement

ప్రశాంత్ నీల్ నిజంగానే ఇలా ప్లాన్ చేశాడో లేక కో ఇన్సిడెన్స్ అయిఉండవచ్చేమో కానీ.. టీజర్ అప్డేట్ మాత్రం ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటునన ఈ సినిమా ప్రశాంత్ యూనివర్స్ లో భాగం అని.. కేజీఎఫ్ కి ఈ మూవీ లింక్స్ ఉన్నాయని చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు వాస్తవమో కాదో తెలియాలంటే.. టీజర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా ఉండి ఈ అప్డేట్ తో భారీ హైప్ నే క్రియేట్ చేసింది. సలార్ టీజర్ అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మెగాస్టార్ కూతురు సుస్మిత కూడా హీరోయిన్ గా నటించారనే విషయం మీకు తెలుసా ?

ఆ హీరోయిన్ కోసం సోనుసూద్ స్పెషల్ దోసెలు.. అభిమానులు ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading