Home » ఆ హీరోయిన్ కోసం సోనుసూద్ స్పెషల్ దోసెలు.. అభిమానులు ఏమంటున్నారంటే..?

ఆ హీరోయిన్ కోసం సోనుసూద్ స్పెషల్ దోసెలు.. అభిమానులు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా వెండితెరపై విలన్ పాత్రల్లో నటిస్తూ.. అందరినీ మెప్పించాడు. కానీ నిజ జీవితంలో మాత్రం అందరితో రియల్ హీరో అనిపించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో చాలామందికి సాయం చేశారు సోనూసూద్. ఇప్పటికి కూడా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పలువురు చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా చేయించి వారి తల్లిదండ్రుల కళ్ళలో వెలుగులు నింపుతున్నాడు. 

Advertisement

కొద్దిరోజులకు ముందు బీహార్ లోని  అనాధ, పేద పిల్లల కోసం ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ని కూడా నిర్మించినట్లు చెప్పాడు సోనుసూద్. సినిమాలల్లో నటిస్తూనే తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నాడు ఈ నటుడు. ప్రస్తుతం ఎంటీవీ రోడీస్ సీజన్ 19 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.   ఇదే షోలో బాలీవుడ్ హీరోయిన్, దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రియా చక్రవర్తి కూడా నటిస్తుంది. ప్రస్తుతం టీవీ షో షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్నట్టు సమాచారం. 

Advertisement

ఈ తరుణంలోనే సెట్లో ఉన్న వారందరి కోసం సరదాగా దోసెలు వేశారట. ముఖ్యంగా  ఎవరికి ఎలాంటి దోసె  కావాలో అడిగి మరీ వేశారంట. ఇదే సమయంలో హీరోయిన్ రియా కూడా అక్కడికి వచ్చింది.  ఆమెకి కూడా సోను సూద్  దోసెలు సిద్ధం చేసి మరి ఇచ్చారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోను సింప్లిసిటీని చూసిన ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఫ్యాన్స్ మాత్రం సోనీ బాయ్ రియాకు మీరు కొద్దిగా దూరంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణించిన కేసులో రియాపై ఆరోపణలు ఉన్న విషయము తెలిసిందే.  సుశాంత్ సింగ్ అభిమానులు ఈ కామెంట్స్ ఎందుకు చేశారనేది ఇప్పుడూ ప్రశ్నార్థకంగా మారింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 విడుదలయ్యేది అప్పుడే..?

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ మళ్లీ ఆ పాత్రలోనా..?

Visitors Are Also Reading