Home » ఆధార్ మాదిరిగా విద్యార్థులకు డీజీ ఐడీ కార్డులు.. కేంద్రం కీలక నిర్ణయం !

ఆధార్ మాదిరిగా విద్యార్థులకు డీజీ ఐడీ కార్డులు.. కేంద్రం కీలక నిర్ణయం !

by Anji
Ad

దేశంలోని ప్రతి వ్యక్తికి ఓ గుర్తింపు ఉండేవిధంగా ఆధార్ కార్డులను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో ప్రతీ విద్యార్థికి ఓ డీజీ కార్డును జారీ చేయనున్నది. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు టీచర్ల నుంచి ప్రొఫెసర్ల వరకు అందరికీ ఈ కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డులను ఆధార్ తో, అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ తో లింగ్ చేస్తారు.  

Also Read :  శాకుంతలంలోని సానుమతి లుక్ లో వర్షిణి మామూలుగా లేదుగా..!

Advertisement

వీటిని జారీ చేయడంపై నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం సూచనతో కేంద్రం విద్యాశాఖ మాజీ ఏఐసీటీఈ చైర్మన్ ప్రొపెసర్ అనిల్ సహస్రబుద్దే నేతృత్వంలో ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విద్యాశాఖ, పాఠశాల విద్య, ఎన్ఐసీ, యూఐఈడీ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి సమగ్ర ప్రాజెక్ట్ రూపొందించింది. ఎడ్యుకేషన్ ఎకోసిస్టం రిజిస్ట్రీస్ పేరుతో డాక్యుమెంట్ రూపొందించింది. ఈమేరకు డీజీ కార్డుల రిజిస్ట్రేషన్ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెల్ కి అప్పగించారు. సాధారణంగా విద్యార్థులు ఓ విద్యాసంస్థ నుంచి మరో సంస్థకు మారుతుంటారు.

Advertisement

పై చదువుల కోసం ఇతర కళాశాలలో చేరుతుంటారు. వారిలో వలస కుటుంబాలు లేదంటే ఫర్మినెంట్ అడ్రస్ లేని విద్యార్థులు కూడా ఉంటారు. విద్యార్థుల హిస్టరీ ట్రాక్ చేసేందుకు పాఠశాలల్లో అలాంటి పిల్లల నమోదు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత విద్య సంస్కరణల్లో భాగంగా ఇటీవల మల్టీపుల్ ఎంట్రీ, మల్టీపుల్ ఎగ్జిట్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు కోర్సు మధ్యలోనే నిష్క్రమించడం.. తిరిగి చేందుకు, క్రెడిట్స్ ని బదిలీ చేసుకునే అవకాశాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీ కార్డును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. విద్యార్థులకే కాదు.. బోధనా సిబ్బందికి ఉపయోగపడుతుంది. 

Also Read :  “ఈ సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !

Visitors Are Also Reading