Home » “ఈ సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !

“ఈ సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !

by AJAY
Ad

కొన్ని సినిమాల‌లో హీరోహీరోయిన్ ల కంటే సైడ్ క్యారెక్ట‌ర్ ల‌కే ఎక్కువ పాపులారిటీ వ‌స్తుంది. వారి అందంతోనో లేదా న‌ట‌న‌తోనే ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తారు. అలా రీసెంట్ గా కొన్ని సినిమాల‌లో హీరోహీరోయిన్ ల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న సైడ్ క్యారెక్ట‌ర్ లు ఏవో ఇప్పుడు చూద్దాం….ఒరు ఆధార్ లవ్ అనే త‌మిళ సినిమాకు ఓవ‌ర్ నైట్ క్రేజ్ పెరిగింది.

Advertisement

అయితే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్ట‌ర్ ల కంటే ప్రియాప్ర‌కాష్ వారియ‌ర్ కే ఎక్కువ పాపులారిటీ వ‌చ్చింది. ఈ ముద్దుగుమ్మ ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారింది. అంతే కాకుండా రీసెంట్ వ‌చ్చిన ల‌వ్ టుడే సినిమాలో హీరోయిన్ కంటే హీరో చెల్లెలు అందంగా కనిపించింది. ఆమె పేరు ర‌వీనా కాగా ఈ సినిమా త‌ర‌వాత సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ లు తెగ వెతికేసి అకౌంట్ ను ఫాలో అయ్యారు.

Advertisement

డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించగా హీరోయిన్ గా ర‌ష్మిక న‌టించింది. ర‌ష్మిక కు సోద‌రిగా న‌టించిన శృతి రామ‌చంద్ర‌న్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. హిట్ 2 సినిమాలో హీరోయిన్ గా హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రి న‌టించింది. కాగా హీరోయిన్ కు సోద‌రిగా కోమ‌లి ప్ర‌సాద్ న‌టించింది. ఈ సినిమాలో కోమ‌లి ప్ర‌సాద్ కే ఎక్కువ మంది ఫిదా అయ్యారు.

అంతే కాకుండా బాల‌కృష్ణ శృతిహాస‌న్ హీరోహీరోయిన్ లుగా న‌టించిన సినిమా వీర‌సింహారెడ్డి. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాస‌న్ కంటే సెకండ్ హాఫ్ లో వ‌చ్చిన హ‌నీరోజ్ కే ఎక్కువ పాపులారిటీ వ‌చ్చింది. ఈ సినిమా త‌ర‌వాత హ‌నీరోజ్ ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యింది. అంతే కాకుండా ఈ చిత్రం త‌ర‌వాత హ‌నీరోజ్ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయింది. అంతే కాకుండా గీతాగోవిందం సినిమాలో కూడా హీరోయిన్ రష్మిక కంటే విజ‌య్ దేవ‌ర‌కొండ చెల్లెలిగా న‌టించిన న‌టి త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది.

ALSO READ : Sanghavi : ఆ డైరెక్టర్ తో హీరోయిన్ సంఘవి ఎఫైర్ …?

Visitors Are Also Reading