Home » ఢిల్లీ క్యాపిటల్స్ కు చేదు అనుభవం.. క్రికెట్ కిట్లు చోరీ !

ఢిల్లీ క్యాపిటల్స్ కు చేదు అనుభవం.. క్రికెట్ కిట్లు చోరీ !

by Anji
Ad

ఐపీఎల్ 16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ష్ జట్టు వరుస ఓటమి పాలై లీగ్ పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో ఓడిపోయి ఇంతవరకు ఒక్క బోణి కూడా కొట్టలేదనే బాధలో ఉన్న ఈ జట్టుకు మరొక చేదు అనుభవమే ఎదురైంది.  ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియాలో తెగ విమర్శలు ఎదురవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు సంబంధించిన క్రికెట్ కిట్లు, చోరీకి గురయ్యాయి. బెంగళూరు-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం విధితమే. 

Also Read :   విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్

Advertisement

ఓమ్యాచ్ తరువాత ఢిల్లీకి చేరుకున్న ఆ జట్టు బ్యాట్లు, ప్యాడ్ లు తదితర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాట్లు అసలు కనిపించకుండా పోయాయి. బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్న ఈ జట్టు బస చేసే హోటల్ రూమ్ కి వచ్చాక  తమ వస్తువులు చోరీకి గురైనట్టు తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఈ చోరీపై లాజిస్టిక్ కంపెనీకి, ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కిట్ బ్యాగ్ ల నుంచి 16 బ్యాట్ లతో పాటు ప్యాడ్స్, షూలు, ఫ్యాడ్లు, గ్లౌజులు వంటివి దొంగిలించబడ్డాయి. 

Advertisement

Also Read :  లీకైన వెంకటేష్ సైందవ్ సినిమా స్టోరీ ఇదే.. హిట్ కొట్టేనా ?

Manam News

డేవిడ్ వార్నర్ కి సంబంధించి 3 బ్యాట్స్, 2 మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్  3 బ్యాట్స్, యాష్ ధుల్ 5 బ్యాట్స్ చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి గురైన ఒక్కో బ్యాట్ ఖరీదు దాదాపు రూ.లక్ష వరకు ఉంటుందట.  గురువారం ఢిల్లీ-కోల్ కత్తా మధ్య మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ఆటగాళ్లు కొత్త బ్యాట్ల కోసం తమ ఏజెంట్లను సంప్రదించారు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ వైపు వరుస ఓటములతో సతమతమవుతుటే.. మరోవైపు క్రికెట్ కిట్ల బ్యాగ్ లు చోరీకి గురవ్వడం చేదు అనుభవం అనే చెప్పాలి. ఈ విషయం తెలిసిన కొందరూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు మాత్రం ఆ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. 

Also Read :  తగ్గేదేలే.. విరాట్‌ కోహ్లీకి ధమ్కీ ఇచ్చిన దాదా

 

Visitors Are Also Reading