Home » విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్

విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్

by Bunty
Ad

ఐపీఎల్ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సిబి పరాజయం పాలైంది.  అయితే… నిన్న జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. స్టాండ్స్ లో ఓ పిల్లాడు హాయ్ విరాట్ అంకుల్… వమికను డేట్ కు తీసుకెళ్లొచ్చా అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు.

READ ALSO : IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్

Advertisement

ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి గురించి ఇలాంటి మెసేజ్ లు ఏంటని జనాలు చీదరించుకుంటున్నారు. కొందరేమో పిల్లాడికి ఏం తెలుసు… ఆ చిన్నారి బుద్ధిలేని తల్లిదండ్రులే ఇలా చేయించి ఉంటారని అంటున్నారు.

Advertisement

READ ALSO : టాలీవుడ్‌లో విషాదం.. కమెడియన్ కన్నుమూత

Can I Take Vamika on Date?': Kid's Placard for Virat Kohli's Daughter Gets Thumbs Down on Twitter

ఇంకొందరేమో జనాల దృష్టిని ఆకర్షించేందుకు కొందరు ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారని లైట్ గా తీసుకుంటున్నారు. మెజారిటీ శాతం ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. కాగా… విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గారాల పట్టి వమికా అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు ఈ మ్యాచ్ లో కోహ్లీ బిహేవీయర్ కు బీసీసీఐ ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.

READ ALSO :  Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

Visitors Are Also Reading