నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ట్రైన్ ను స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ ట్రైన్ అనేక సౌకర్యాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సౌకర్యాలకు తగ్గట్టే టికెట్ రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయట. సాధారణ మధ్యతరగతి వారు ఈ ట్రైన్ లో ఎక్కడం కాస్త కష్టం అని చెప్పవచ్చు. మరి పేద ప్రజలు ఈ ట్రైన్ ఎక్కడం కలగా మిగిలి పోతుందా..సామాన్యులకు కూడా అందుబాటులో ఉందా అనే విషయాలను తెలుసుకుందాం.. అలాంటి ఈ ట్రైన్ లో తక్కువ ధరలో జర్నీ చేయాలనుకుంటే ఒక అవకాశం ఉంది అది ఏంటయ్యా అంటే..
also read;సీఎం కేసీఆర్ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?
Advertisement
also read:విరామం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్న 5 స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?
Advertisement
అయితే ఈ రైల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ టికెట్ ధర 1680 ఉంటుంది. ఇందులో బేసిక్ ధర 1168 ఉండగా రిజర్వేషన్ చార్జి 40 రూపాయలు, సూపర్ ఫాస్ట్ ఛార్జ్ 45 రూపాయలు, ఇక జీఎస్టీ రూపాయలు 63, క్యాటరింగ్ చార్జీలు 364 ఉంటాయి. ఒకవేళ మీరు ఫుడ్డు వద్దనుకుంటే మాత్రం టికెట్ బుక్ చేసే సమయంలో నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫుడ్ చార్జీలు పడవు. ఆ టైంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్ ధర 1340తగ్గుతుంది. కన్వీనియన్స్ ఫీజు అదనంగా ఉంటుంది. కొంతమంది వందే భారత రైలు ఒక్కసారైనా ఎక్కాలని కోరుకుంటూ ఉంటారు. కనీసం తక్కువ దూరమైన ట్రావెల్ చేయాలని కో*క ఉంటుంది.
అలాంటివారికి తక్కువ ధరకు కూడా ట్రైన్ ఎక్కవచ్చు. ఏలాగంటే సికింద్రాబాద్ నుంచి నల్గొండకు, అంతేకాకుండా గుంటూరు నుంచి ఒంగోలుకు ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు నో ఫుడ్ ఆప్షన్ ఉంచుకొని టికెట్ బుక్ చేసుకోవాలి. ఇక ఈ టికెట్ ధర 455 ఉంటుంది. గుంటూరు నుంచి ఒంగోలుకి ప్రయాణిస్తే 490 రూపాయలు చార్జ్ పడుతుంది. ఈ విధంగా ఒక్కసారైనా ఈ ట్రైన్ ఎక్కాలని భావించే వారికి మంచి అవకాశం. అయితే ఇది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది, మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. తిరుపతిలో 3.15 బయలుదేరి రాత్రి 11.45 తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
also readVirupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?