Home » సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

by Bunty
Ad

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసి) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రక్షాళన దిశగా “ఈసి” అడుగులు వేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల గుర్తింపుల్లో మార్పులు చేర్పులు చేసింది. “ఆమ్ ఆద్మీ పార్టీ” (ఆప్)కు జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిన ఈసీ…. సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ”లకు జాతీయ పార్టీ గుర్తింపు రద్దు చేసింది.

READ ALSO : Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్‌ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?

Advertisement

అటు “భారత రాష్ట్ర సమితి” (బీఆర్ఎస్)కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ ఇచ్చింది. యూపీలో “రాష్ట్రీయ లోక్ దళ్” (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్‌లో “రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ” (ఆర్ఎస్పీ)లకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది.త్రిపురలో “తిప్రా మోతా పార్టీ”కి, మేఘాలయలో “వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ”కి , నాగాలాండ్‌లో “లోక్ జనశక్తి” (రాంవిలాస్) పార్టీకి రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు ఇచ్చింది ఈసీ.

Advertisement

READ ALSO :  Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

With BRS and national ambitions, KCR gains appetite for Andhra-wala vote | Deccan Herald

“ఎన్నికల గుర్తు” (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం “ఈసీ” తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు కోసం ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు లేదా మొత్తం అసెంబ్లీ సీట్లలో 3 శాతం సీట్లు లేదా 25 ఎంపీ సీట్లకు ఒక సీటైనా గెలిచి ఉండాలని తెలిపింది. అలాగే, పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లైనా వచ్చి ఉండాలంది ఈసీ. ఏపీలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదు “బీఆర్ఎస్”. అందుకే, ఆ రాష్ట్రంలో “బీఆర్ఎస్‌”కు రాష్ట్ర పార్టీ గుర్తింపు రద్దు చేసింది ఈసీ. కేవలం తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తిస్తూ “ఈసీ” ఆదే శాలు జారీ చేసింది ఈసీ.

READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Visitors Are Also Reading