Home » Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్‌ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?

Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్‌ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?

by Bunty
Ad

 

మెగా హీరో సాయితేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ ఆక్సిడెంట్ తర్వాత సాయితేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలిచిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది.

READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Advertisement

 

బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ ఏంటన్న దానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది మూవీ. ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది.

Advertisement

READ ALSO :  Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

A New Poster From Sai Dharam Tej And Samyukta's Virupaksha Is Out Ahead Of The Trailer Launch

2. 05 నిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆధ్యాంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్‌ చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టుకొని చూసేలా ట్రైలర్‌ ఉంది. హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కనిపిస్తోంది. అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తుంది. చాలాగ్యాప్ తర్వాత సాయితేజ్ చేసిన ఈ సినిమా ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

Visitors Are Also Reading