Home » త‌గ్గేదే లే అంటూ వార్న‌ర్ బాబాయ్ బ్యాక్…ఫ్యాన్స్ కుషీ..!

త‌గ్గేదే లే అంటూ వార్న‌ర్ బాబాయ్ బ్యాక్…ఫ్యాన్స్ కుషీ..!

by AJAY
Ad

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క్రికెట‌ర్ గా డేవిడ్ వార్న‌ర్ ఎంత పాపులారిటీ సంపాదించాడో తెలుగు వీడియోల‌కు డైలాగుల‌కు టిక్ టాక్ చేసి తెలుగునాట అంత‌టి పాపులారిటీ సంపాదించాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌పున క్రికెట్ ఆడి వార్న‌ర్ తెలుగువారికి ద‌గ్గ‌ర‌కాగా తెలుగు సినిమాల పాట‌లు డైలాగుల‌కు వీడియోలు చేసి మ‌రింత మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా వార్న‌ర్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ పురంలో సినిమాతో తెలుగు పాట‌లకు స్టెప్పులు వేయడం మొద‌లు పెట్టాడు.

warner pushpa dailog

warner pushpa dailog

బుట్ట బొమ్మ పాట‌కు వార్న‌ర్ వేసిన స్టెప్పులు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అంతే కాకుండా వార్న‌ర్ ఆ త‌ర‌వాత అదే పాట‌కు త‌న కుటుంబంతో కూడా క‌లిసి స్టెప్పుల వేసి ఆక‌ట్టుకున్నాడు. ఇక వార్న‌ర్ ఈ పాట‌కు స్టెప్పులు వేయ‌డంతో పాటతో పాటు అల్లు అర్జున్ క్రేజ్ కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఈ సినిమాకు స్వ‌రాలు స‌మకూర్చిన త‌మ‌న్ ఫేట్ కూడా మారిపోయింది. అయితే సన్ రైజ‌ర్స్ జ‌ట్టుకు దూర‌మైన త‌ర‌వాత మ‌ళ్లీ తెలుగు వీడియోల‌కు వార్న‌ర్ దూరం అయ్యాడు.

Advertisement

Advertisement

also read : ఆచార్య నుండి మందాకినీ సాంగ్ ప్రోమో విడుద‌ల‌..స్టెప్పుల‌తో దుమ్ముదులిపిన మెగాస్టార్..!

దాంతో ఆయ‌న అభిమానులు నిరాశ చెందారు. కాగా పుష్ప సినిమా డైలుగుతో త‌గ్గేదే లే అంటూ వార్నర్ మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో వార్న‌ర్ అభిమానులు కుషీ అవుతున్నారు. వార్న‌ర్ బాయ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్ప‌టికే పుష్ప సినిమా స‌క్సెస్ ఫుల్ గా క‌లెక్ష‌న్లు రాబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వార్న‌ర్ మ‌ళ్లీ పుష్ప‌కు డైలాగ్ చెప్ప‌డంతో సినిమాకు మ‌రింత ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. మొత్తానికి వార్న‌ర్ బాయ్ తెలుగు సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CYGtkrnpsBm/?utm_source=ig_web_copy_link

Visitors Are Also Reading