Home » ఆచార్య నుండి మందాకినీ సాంగ్ ప్రోమో విడుద‌ల‌..స్టెప్పుల‌తో దుమ్ముదులిపిన మెగాస్టార్..!

ఆచార్య నుండి మందాకినీ సాంగ్ ప్రోమో విడుద‌ల‌..స్టెప్పుల‌తో దుమ్ముదులిపిన మెగాస్టార్..!

by AJAY

మెగాస్టార్ చిరంజీవి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఆచార్య‌. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా సినిమాలో పూజా హెగ్డే న‌టించింది. ఆల‌యాల సంర‌క్ష‌ణ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెర‌క్కింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కొనిదెల ప్రొడ‌క్ష‌న్స్ పై రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి లాహే లాహే సాంగ్ తో పాటూ టీజర్ మ‌రియు పోస్టర్ లను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

acharya item song promo

acharya item song promo

కాగా తాజాగా ఈ సినిమా నుండి సానా కష్టం సాంగ్ ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. సానా క‌ష్టం వ‌చ్చిందే మందాకినీ అంటూ సాగిన ఈ ప్రోమోలో చిరంజీవి స‌ర‌స‌న రెజీనా స్టెప్పులు వేసింది. ఈ పూర్తి పాట‌ను జ‌న‌వరి 3 వ తేదీన సాయంత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ పాట‌లో చిరు త‌న‌దైన గ్రేస్ తో స్టెప్పులు వేశారు. రెజీనా కూడా అదే రేంజ్ లో స్టెప్పులు వేసింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

also read :  ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో తెలంగాణ‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు..అలా చేస్తే రూ.1000 జ‌రిమానా.!

Visitors Are Also Reading