Home » ‘దహాద్’ వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ…. ఓటిటిలో దుమ్ము లేపుతోంది

‘దహాద్’ వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ…. ఓటిటిలో దుమ్ము లేపుతోంది

by Bunty
Published: Last Updated on

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన తొలి వెబ్ సిరీస్ దహాద్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. రీమా కంగ్టి, జోయా అక్బర్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ మే 12 నుంచి ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతుంది.

ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తం ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేశాయి. గౌరవ్ రైనా, తరానా మార్వా మ్యూజిక్ అందించారు. సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవ్ గన్, మాధురి దీక్షిత్, సుష్మిత సేన్, అదితి రావు హైదరి లాంటి నటులు తరచూ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

కథ మరియు వివరణ :

రాజస్థాన్ లోని మండవలో వరుస హ*లు జరుగుతూ ఉంటాయి. అది కూడా పబ్లిక్ టాయిలెట్స్ లో. ఈ కేసు పోలీసులకి తలనొప్పిగా మారుతుంది. ముందుగా ఈ మరణాలను ఆత్మహలుగా భావిస్తారు. కానీ… తర్వాత దీని వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుస్తోంది. ఈ కేసును చేదించడానికి సబ్ ఇన్స్పెక్టర్ అంజలి బాటి (సోనాక్షి సిన్హా) రంగంలోకి దిగుతుంది. మరి ఆ మరణాలు నిజంగా ఆత్మహలేనా? కాకపోతే వారిని ఎవరు ఎందుకు చంపుతున్నారు అనేది మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ అంజలి భాటిగా సోనాక్షి సిన్హా అద్భుతమైన నటనని కనబరిచింది.

అంత దారుణమైన హ*కేసును చేదించే పోలీసు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక మరో ముఖ్యపాత్రలో విజయ్ వర్మ నటించాడు. ఆయన పాత్ర కూడా ఈ సిరీస్ లో చాలా కీలకం. అమాయకుడైన ఉపాధ్యాయుడి పాత్రలో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు విజయ్ వర్మ. ఇక మిగతావారు ఉత్తమ పాత్రకి న్యాయం చేశారు. సినిమా క్వాలిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా ‘దహాద్’ వెబ్ సిరీస్ ఉంది. తనయ్ సత్తమ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. రాజస్థాన్ అందాలని లాంగ్ షాట్స్ తో చాలా చక్కగా క్యాప్చర్ చేసింది. గౌరవ్, తరన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్… సిరీస్ మూడ్ కి తగ్గట్టు సెట్ అయిపోయింది. ఆనంద్ సుభాయ ఎడిటింగ్ విషయంలో కాస్త దృష్టి పెట్టుండాల్సింది. ప్రతి ఎపిసోడ్ ని కాస్త ట్రిమ్ చేస్తుంటే మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading