Home » PKL 2022 : మొద‌టి సారి ఛాంపియ‌న్‌గా ద‌బంగ్ ఢిల్లీ

PKL 2022 : మొద‌టి సారి ఛాంపియ‌న్‌గా ద‌బంగ్ ఢిల్లీ

by Anji
Ad

ఓ వైపు ప్ర‌త్య‌ర్థి మూడు సార్లు టైటిళ్లు గెలిచిన ఘ‌న చ‌రిత్ర పైగా ఈ సీజ‌న్‌లో అద్భుత‌మైన ఫామ్‌లో కొన‌సాగుతుంది. ముఖ్యంగా టేబుల్ టాప‌ర్‌గా నిలిచి టైటిల్ ఖాయం అనే అచంనాల‌తో బ‌రిలోకి దిగింది. ఫైన‌ల్‌లో తొలి అర్ద‌భాగంలో సైతం ఆ జ‌ట్టుదే పైచేయి. కానీ ద‌బంగ్ ఢిల్లీ లొంగ‌లేదు. త‌డబ‌డినా.. పోరాడి చివ‌రికీ గెలిచి టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. పాట్నా పైరేట్స్ – ద‌బంగ్ ఢిల్లీ మ‌ధ్య ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ -8 ఫైన‌ల్ ఉత్కంఠ‌గా కొన‌సాగింది. ఈ లీగ్‌లో టైటిల్ కైవ‌సం చేసుకోవ‌డం ఢిల్లీకి ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం.

Also Read :  ర‌ష్యాలో పుతిన్‌కు నిర‌స‌న సెగ‌..!

Advertisement

ముఖ్యంగా దబంగ్ ఢిల్లీ అద‌ర‌గొట్టింది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించి ప్రొ క‌బ‌డ్జీ సీజ‌న్‌-8లో ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఫైనల్‌లో ఢిల్లీ 37-36 తో పాట్నాను ఓడించింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి నువ్వా.. నేనా అన్న‌ట్టుగా పోరు సాగింది. పాట్నా త‌రుపున స‌చిన్‌, ఢిల్లీ త‌రుపున న‌వీన్, విజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ప్రారంభంలో ప్ర‌త్య‌ర్థిని ఆలౌట్ చేసి పాట్నా జోరు మీద క‌నిపించింది. కానీ ఢిల్లీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇరు జ‌ట్లు రైడ్ పాయింట్ల‌తో పాటు ట్యాకిల్ పాయింట్ల‌ను సొంతం చేసుకోవ‌డంతో పోటీ ఉత్కంఠ‌గా మారిపోయింది. విరామ స‌మ‌యానికి 17-15 తో స్వ‌ల్ప ఆధిక్యంలో నిలిచింది పాట్నా.

Advertisement

ముఖ్యంగా ఢిల్లీ ఆట‌గాడు న‌వీన్ అద్భుతంగా ఆడ‌డంతో ఢిల్లీ నెమ్మ‌దిగా పుంజుకుంది. ఓ ద‌శ‌లో 25-25 స్కోరు స‌మానం చేసింది. ఆ త‌రువాత పాట్నా కూడా పోరాడినా ప్ర‌త్య‌ర్థిని ఆటౌల్ చేసిన ఢిల్లీ 30-28తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్క‌డ నుంచి పాట్నా పుంజుకోవ‌డానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించింది. ఇక ఢిల్లీ మాత్రం ప‌ట్టు వ‌ద‌ల‌లేదు. రెజా, గ‌మ‌న్ విజృంభించ‌డంతో 35-36 పాయింట్ల‌తో పాట్నా ప్ర‌త్య‌ర్థిని స‌మీపించింది. కీల‌క స‌మ‌యంలో పాయింట్ సాధించిన ఢిల్లీ మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను ద‌క్కించుకుంది.

ఈ సీజ‌న్‌లో ఢిల్లీ విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించిన న‌వీన్ కుమార్ (13) ఫైన‌ల్‌లో స‌త్తా చాట‌గా.. అత‌నితో పాటు విజ‌య్ మాలిక్ (14) కూడా ప్ర‌తిభ చాటాడు. దీంతో ఢిల్లీ ప్రొ క‌బ‌డ్డీ గెలిచిన ఆర‌వ జ‌ట్టుగా నిలిచింది. జైపూర్ 2014, యు ముంబా 2015, పాట్నా 2016 (జ‌న‌వ‌రి, జూన్‌) రెండు సార్లు, పాట్నా 2017, బెంగ‌ళూరు 2018, బెంగాల్ వారియ‌ర్స్ 2019 టైటిళ్లు గెలిచాయి. క‌రోనా కార‌ణంగా 2020, 2021 సంవ‌త్స‌రాల‌లో మ్యాచ్‌లు జ‌రుగ‌లేదు. తాజాగా సీజన్ -8 టైటిల్ ను ఢిల్లీ సొంతం చేసుకుంది.

Also Read :  ఉక్రెయిన్‌లో ర‌ష్యా విధానాన్ని ఖండిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్‌.. భార‌త్ వైఖ‌రి ఏమిటంటే..?

Visitors Are Also Reading