Home » ఉక్రెయిన్‌లో ర‌ష్యా విధానాన్ని ఖండిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్‌.. భార‌త్ వైఖ‌రి ఏమిటంటే..?

ఉక్రెయిన్‌లో ర‌ష్యా విధానాన్ని ఖండిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్‌.. భార‌త్ వైఖ‌రి ఏమిటంటే..?

by Anji
Ad

ఉక్రెయిన్ ర‌ష్యా సైనిక చ‌ర్య‌పై భిన్నాభిప్రాయాల‌తో కూడిన తీర్మాణంపై శుక్ర‌వారం UNSC (United Nations Security Council) ఓటు వేసింది. ఈ ఓటింగ్ ప్రక్రియ‌కు భార‌త్‌, చైనా దూరంగా ఉన్నాయి. ర‌ష్యా దూకుడు విధానాన్ని ఐక్య‌రాజ్య‌తిలో ఓటింగ్ తీర్మాణం ప్ర‌వేశ‌పెట్టారు. ఉక్రెయిన్ నుంచి ర‌ష్య‌న్ ద‌ళాల‌ను త‌క్ష‌ణ‌మే ష‌ర‌తులు లేకుండా ఉప‌సంహ‌రించుకోవాల‌ని పిలుపునిచ్చింది. యూఎన్ఎస్‌సీలో అమెరికాతో పాటు ఆల్బేనియాలు స‌మ‌ర్పించిన ముసాయిదా తీర్మాణంలో ర‌ష్యా దూకుడు, దాడి ఉక్రెనియ‌న్ సార్వ‌భౌమాధికారాన్ని ఉల్లంఘించ‌డం వంటి వాటిని ఖండించారు.

Also Read :  ఏమాయ చేసావే” సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా.?

Advertisement

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంపై అన్ని దేశాలు ఆందోళ‌న చెందుతుండ‌గా.. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశంలో వివిధ దేశాలు ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్క‌రాన్ని క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తూ ఉన్నాయి. యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లో ప‌రిస్థితి తీవ్రంగా మారింది.

Advertisement

ఈ విష‌యంలో భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశంలో భార‌త‌దేశం ఈ యుద్ధాన్ని ఖండించింది. ఉక్రెయిన్‌లో ఇటీవ‌ల ప‌రిణామాల‌తో భార‌తదేశం చాలా క‌ల‌త చెందుతోంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త ప్ర‌తినిధి తిరుమూర్తి అన్నారు. హింస శ‌త్రుత్వాన్ని వెంట‌నే అంతం చేయ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని మేము కోరుతున్నాం.

మ‌రొక వైపు ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంపై యూఎన్ఎస్‌సీ స‌మావేశంలో ఐక్య‌రాజ్య‌స‌మితి పీఆర్ఓ టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ దౌత్య మార్గాన్ని విడ‌నాడ‌డం విచారించ‌ద‌గ్గ విష‌యం అని తెలిపారు. ముఖ్యగా ఇందుకు గ‌ల కార‌ణాల‌న్నింటినీ లెక్కిస్తూ.. ఉక్రెయిన్ దాడిని ఖండిస్తూ.. భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

Also Read :  ర‌ష్యాలో పుతిన్‌కు నిర‌స‌న సెగ‌..!

Visitors Are Also Reading