Home » సుస్మిత సేన్, ల‌లిత్ మోడీ ఫోటో పై ప్ర‌ముఖ‌ క‌మెడియ‌న్ సెటైర్లు.. నెట్టింట వైర‌ల్..!

సుస్మిత సేన్, ల‌లిత్ మోడీ ఫోటో పై ప్ర‌ముఖ‌ క‌మెడియ‌న్ సెటైర్లు.. నెట్టింట వైర‌ల్..!

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం హాట్ టాఫిక్ ఏదైనా ఉందంటే అది సుస్మిత సేన్, ల‌లిత్ మోడీ డేటింగ్ అనే చెప్ప‌వ‌చ్చు. వీరి రిలేష‌న్ పై ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. రాఖీ సావంత్ కూడా వీరిద్ద‌రినీ చూస్తే తండ్రి కూతురు మాదిరిగా ఉన్నారంటూ కామెంట్ చేసింది. సుస్మిత‌కు ఇంకా ఎవ్వ‌రూ దొర‌క‌లేదా..? ఆ ముస‌లోడి వెంట తిరుగుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేశారు. ఈ త‌రుణంలోనే ఓ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వీరిద్ద‌రి వైర‌ల్ ఫోటోను రీక్రియేట్ చేసి వీరు ప‌రువు కూడా తీసేశాడు.

Advertisement

ఇక మ‌రోవైపు ప్ర‌స్తుతం తాము డేటింగ్ లో ఉన్నామ‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ల‌లిత్ మోడీ ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు. అంద‌రి దృష్టి ఇద్ద‌రిపై ప‌డింది. ల‌లిత్ మోడీ విదేశాల‌కు ఎందుకు పారిపోయాడు..? ఇప్పుడు ఎక్క‌డ ఉంటున్నాడు..? సుస్మిత సేన్ ఎఫైర్లు ఎన్ని ఉన్నాయ‌నే విష‌యాలు ఆరా తీస్తున్నారు. సుష్మిత సేన్ వ‌య‌సు 46 ఏళ్లు. ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లి చేసుకోని ఈ బామ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 10 మందితో సహ‌జీవ‌నం చేసింది. ల‌లిత్ మోడీ కంటే ముందు త‌న క‌న్న 15 ఏల్ల చిన్న వాడైన మోడ‌ల్ రొహ్మాన్ షాల్ తో స‌హ‌జీవ‌నం చేసింది. దాదాపు మూడు సంవ‌త్స‌రాలు క‌లిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది. వీరిద్ద‌రి ఫోటోలు వైర‌ల్ అయిన విష‌యం విధిత‌మే.

Advertisement

తాజాగా సుష్మిత సేన్ ల‌లిత్ మోడీ వ్య‌వ‌హారం బ‌య‌టికి రావ‌డంతో ఇప్పుడు వీరి రిలేష‌న్ పై ఎవ‌రికీ తోచిన విదంగా వారు స్పందిస్తున్నారు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ త‌న్మ‌య్ భ‌ట్ ఈ జంట రొమాంటిక్ ఫోటోను క్రియేట్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఇక అక్క‌డే ఓ ట్విస్ట్ మొద‌లైంది. సుష్మిత ల‌లిత్ మోడీ పోటో ఉన్న‌ట్టుగానే ల‌లిత్ మోడీలా త‌న్మ‌య్ భ‌ట్ సోఫాలో ప‌డుకుని ఉన్నాడు. `ఇక అత‌ని స్నేహితుడు న‌వీద్ మాన‌క్కోడ‌న్ అత‌ని ప‌క్క‌నే కూర్చున్నాడు. వీరిద్ద‌రూ ఒక‌రి క‌ళ్ల‌లో మ‌రొక‌రు చూసుకుంటున్నారు. త‌న్మ‌య్ భ‌ట్ త‌న స్నేహితుని త‌ల‌పై త‌న చేతిని ఒరిజిన‌ల్ ఫోటోలో మాదిరిగానే ఉంచాడు. ఇక ఈ ఫోటోకు వాళ్లు ఇచ్చిన క్యాప్ష‌న్ మ‌రింత హాస్య‌స్ప‌దంగా మారింది.

ల‌లిత్ మోడీ మాదిరిగానే త‌న ఫోటోకు త‌న్మ‌య్ కూడా క్యాప్స‌న్ ఇచ్చాడు. నూత‌న ఆరంభం, ఒక కొత్త జీవితం. పైగా చంద్రుడు.. ప్రేమ అంటే పెళ్లి కాదు. ఇంకా కానీ దేవుడి ద‌య వ‌ల్ల ఒక‌టి జ‌రుగుతుంది. మేము ఫ్లాట్ మెట్స్ అని నేను ఇప్పుడే ప్ర‌క‌టించాన‌ని ఆ క‌మెడీయ‌న్ రాసుకొచ్చాడు. ఇక సుస్మిత సేన్, ల‌లిత్ మోడీపై అత‌డు చేసి రీక్రియేట్ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Also Read : 

విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా కథ ఇదేనట…..? సోషల్ మీడియాలో వైరల్….!

వివి.నాయక్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన ఆ చిత్రానికి కొడాలి నాని ఎందుకు అడ్డుపడ్డారు…. ఇంట్రెస్టింగ్ స్టోరీ….!

Visitors Are Also Reading