Home » విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా కథ ఇదేనట…..? సోషల్ మీడియాలో వైరల్….!

విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా కథ ఇదేనట…..? సోషల్ మీడియాలో వైరల్….!

by AJAY
Ad

పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్ మరియు చార్మి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ పాన్ ఇండియాకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

లైగర్ సినిమా విడుదలకు ముందే సినిమా కథ ఇదేనంటూ కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చుట్టూరా కథ తిరుగుతుందని తెలుస్తోంది.i అంతేకాకుండా లైగర్ పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలో… మైక్ టైసన్ ను ఎంతో అభిమానించే వాడిగా కనిపించబోతున్నాడట. అంతేకాకుండా జీవితంలో ఒక్కసారైనా మైక్ టైసన్ తో సెల్ఫీ తీసుకోవాలనేది అతడి డ్రీమ్ అట.

కానీ సినిమా క్లైమాక్స్ లో మైక్ టైసన్ తో టైగర్ తలపడే సందర్భం వస్తుందట. ఈ బాక్సింగ్ ఫైట్ లో మైక్ టైసన్ కన్నుమూస్తారట. దాంతో లైగర్ తన ఒడిలో మైక్ టైసన్ ను పడుకోబెట్టుకుని అతడితో సెల్ఫీ దిగుతాడట. ఈ సీన్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. సినిమా అసలు కథ ఏంటో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading