Home » రాజమౌళి సినిమాలో అవకాశం వదులుకున్న హీరోలు!

రాజమౌళి సినిమాలో అవకాశం వదులుకున్న హీరోలు!

by Bunty
Ad

రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ డైరెక్టర్లు అందరిలో అగ్రస్థానంలో ఉంటాడు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. తాను తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, మగధీర, మర్యాద రామన్న, చత్రపతి, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి.

pawan-kalyan-and-rajamouli

pawan-kalyan-and-rajamouli

రీసెంట్ గా తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. రాజమౌళితో సినిమా అవకాశాలకోసం హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని చూసే హీరోలు కూడా ఉన్నారు. రాజమౌళి అవకాశం ఇచ్చిన కూడా సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాజమౌళితో సినిమా అవకాశాలను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

# పవన్ కళ్యాణ్

విక్రమార్కుడు సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ కు చెప్పారట. ఇక అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ విక్రమార్కుడు సినిమాను రిజెక్ట్ చేశాడట.

 

# సూర్య

Advertisement

బాహుబలి సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరో సూర్యను సంప్రదించారట రాజమౌళి. కానీ వేరే కారణాలతో సూర్య ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట.

# మోహన్ లాల్

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర కోసం మోహన్ లాల్ ను చేయమని అడిగితే మోహన్ లాల్ రిజెక్ట్ చేశాడట. తనకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నో చెప్పారట.

# వివేక్ ఒబేరాయ్

బాహుబలి సినిమాలో బల్లాల దేవా పాత్రకు వివేక్ ను అడిగితే కొన్ని కారణాల చేత ఆయన చేయనని చెప్పారట.

# జాన్

బాహుబలి సినిమాలో బల్లాలదేవ పాత్రకు ఇతన్ని కూడా రాజమౌళి సంప్రదించారట. కానీ అతను కూడా నో చెప్పారట.

# బాలకృష్ణ

సింహాద్రి సినిమాలో ముందుగా హీరో పాత్రలో ఎన్టీఆర్ ను కాకుండా బాలకృష్ణను అనుకున్నారట. కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారట.

ఇవి కూడా చదవండి

ఈ హీరోలు ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలు ఇవే…!

50 ఏళ్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపిస్తున్న హీరోలు!

Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

Visitors Are Also Reading