Home » పవన్ చేసిన తప్పుకి క్షమించండంటూ ఆ పని చేసిన చిరు..!!

పవన్ చేసిన తప్పుకి క్షమించండంటూ ఆ పని చేసిన చిరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సామాన్య జనం లాగే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్లు కూడా గొడవల విషయంలో ఎన్నో జాగ్రత్తలు పడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో మెగా ఫ్యామిలీకి కూడా ఓ అనుభవం ఉంది. అయితే మెగా ఫ్యామిలీ కి వచ్చిన సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదుటివారికి ఏదైనా ప్రాబ్లం ఉందంటేనే ఆగకుండా చిరంజీవి అందరికంటే ముందుంటాడు. అలాంటిది సొంత తమ్ముడు విషయంలో సమస్య వస్తే ఇక ఆయన ఎలా స్పందిస్తాడో మనం చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఓ పొరపాటుకు చిరంజీవి క్షమాపణలు కోరారట. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి గారు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవితో పాటు కొణిదెల కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

అప్పట్లో చిరంజీవి తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవి హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే అప్పట్లో గుండాయిజం ఎక్కువగా ఉండేది. అయితే చిరంజీవి నటిస్తున్న షూటింగ్ స్పాట్ లోకి వచ్చి కొందరు గుండాలు, ఆకతాయిలు అల్లర్లు చేశారు. ఇంకొంతమందైతే చిరంజీవి ని బూతులు తిట్టే సారు. కానీ చిరంజీవి వారిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి డ్రైవర్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చెప్పగా ఆ మాటలు వినగానే కోపంతో ఊగిపోయాడు పవన్ కళ్యాణ్.

Advertisement

కోపాన్ని ఆపుకోలేక మరుసటి రోజు షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వచ్చి అక్కడున్న గుండాలను ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. అయితే పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోని గూండాలు పవన్ తో గొడవకు దిగారట. కోపం ఆపుకోలేని పవన్ కళ్యాణ్ ఆ గుండాల లో ఒకరిని బాగా కొట్టారట. పవన్ కొట్టిన దెబ్బలతో హాస్పిటల్ లో పడ్డాడు ఓ వ్యక్తి. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అనుకున్నదే తడవుగా హాస్పిటల్ కి వెళ్లి తమ్ముడు పవన్ చేసిన పనికి ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా అతని ట్రీట్మెంట్ కి, మందులకు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడట. ఇంకొకసారి ఇలా చేయకూడదని పవన్ ని కూడా హెచ్చరించాడట. ఇలా తమ్ముడు చేసిన పనికి చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ALSO READ;

సుడిగాలి సుధీర్ చేసిన పనికి షాక్ అయిన నెటిజన్లు.. ఏంటంటే..?

కృతిశెట్టి చేసిన ప‌నికి అస‌హ్యించుకుంటున్న అభిమానులు.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

 

Visitors Are Also Reading