Home » కృతిశెట్టి చేసిన ప‌నికి అస‌హ్యించుకుంటున్న అభిమానులు.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

కృతిశెట్టి చేసిన ప‌నికి అస‌హ్యించుకుంటున్న అభిమానులు.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

by Anji
Ad

ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతిశెట్టి. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది ఈ బ్యూటీ. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజ‌యాన్ని అందుకోవ‌డంతో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక అప్ప‌టి నుంచి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెర‌పై కృతిశెట్టి బాల‌న‌టిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది. అంతేకాదు కొన్ని సీరియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో, జ్యూవెల‌రీ ప్ర‌క‌ట‌న‌లో కూడా మెరిసింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

Advertisement

ఇటీవ‌లే త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేనికి జంట‌గా ది వారియ‌ర్ సినిమాలో న‌టించి మ‌రో స‌క్సెస్ త‌న ఖాతాలో వేసుకుంది. దీనికి తోడు సోష‌ల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది బేబ‌మ్మ‌. ఈమెకు సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ మ‌ధ్య ఫోటో షూట్ అంటూ తెగ సంద‌డి చేస్తోంది. ఈ అమ్మ‌డు త‌న ఇన్ స్టాలో ఏదో ఒక పోస్ట్ తో అంద‌రి దృష్టిలో ప‌డుతుంది. తన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేసుకుంటుంది. దీనికి తోడు త‌న డ్యాన్స్ వీడియోల‌ను ఎక్కువ‌గా ఇన్ స్టాలో షేర్ చేసుకుంటుంది. ఇక ఈమె షేర్ చేసిన వీడియోలు ఇన్ స్టాలో క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ వ‌య‌స్సు చాలా త‌క్కువ కావ‌డంతో ఆమె చేసే పోస్ట్‌ల‌ను చూసి కొంద‌రూ నెటిజ‌న్లు ఆమె చిన్న‌పిల్ల‌నే అన్న‌ట్టు ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement


వాస్త‌వానికి ఇంత చిన్న వయ‌స్సులో హీరోయిన్ కావ‌డం అంటే ఇక మామూలు విష‌యం కాదు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఈ అమ్ముడు చేసిన ఒక ప‌ని వ‌ల్ల అభిమానులు త‌న‌ని అస‌హ్యించుకుంటున్నారు. బేబ‌మ్మ‌కి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. యాంక‌ర్ ని వాల్ పేప‌ర్ ఏంటి అని అడ‌గ‌డంతో వెంట‌నే కృతిశెట్టి కొరియ‌న్‌కి చెందిన బీటీఎస్ వాళ్ల లైవ్ ని వాల్ పేప‌ర్ గా పెట్టుకుంది. ఆ వీడియో చూసిన నెటిజ‌న్లు త‌న‌ను అస‌హించుకున్నారు. నీకు చాలా తెలివి ఉంద‌నుకున్నాం. మ‌న‌దేశంలో ఇంత మంది ఉన్నారు క‌దా.. వారిని ఎందుకు వాల్ పేప‌ర్ గా పెట్టుకున్నావ‌ని నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. మ‌రి ఇంత‌కు కృతిశెట్టి ఏమి స‌మాధానం చెబుతుందో వేచి చూడాలి.

Also Read : 

యాల‌కుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వాటిని తిన‌కుండా ఉండ‌రు..!

Anchor Syamala : యాంక‌ర్ శ్యామ‌ల హోం టూర్ వీడియో చూశారా మీరు..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

 

Visitors Are Also Reading