Home » రామ్ చరణ్ గురించి కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

రామ్ చరణ్ గురించి కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత  దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు పెరిగిపోవడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు కూడా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానాలు రావడం విశేషం. తాజాగా కాశ్మీర్ లో జరుగుతున్న జీ20 సదస్సు 2023లో జరిగే ఈ కార్యక్రమానికి ఈయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  మే 22 నుంచి మూడు రోజులపాటు  జరగనుంది. జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణపై చర్చలు జరుపనున్నారు.

Advertisement

ఇందులో భాగంగా ఇండియన్ ఫిలిమ్స్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ కు అవకాశం రావడంతో ఈయన కాశ్మీర్ లో సందడి చేస్తున్నారు. ఇక మొదటి రోజు ఈ సదస్సులో ఈయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా జితేంద్ర సింగ్ లతో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ  నేపథ్యంలోనే  కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వేదికపై రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా జితేంద్ర సింగ్ చేసిన కామెంట్స్ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి.

Advertisement

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ గురించి పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన  అవసరం లేదనుకుంటాను.  ఇక ఇక్కడికి ప్రజలు వచ్చింది కూడా మనల్ని చూడటానికి కాదని రామ్ చరణ్ ని చూడటానికే ఇక్కడికి వచ్చారు అంటూ జితేంద్ర సింగ్ రామ్ చరణ్ గురించి మాట్లాడడంతో ఒక్కసారిగా రామ్ చరణ్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో  తెగ  వైరల్ అవుతోంది.  ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సులో రామ్ చరణ్ పాల్గొనడంతో అభిమానులు తమ హీరోకి ఇలాంటి గొప్ప అవకాశం రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

శరత్ బాబు చివరి సినిమా ఏంటో మీకు తెలుసా ?

బాలయ్య, రజినీ, శివరాజ్ కుమార్ లతో మల్టీస్టారర్ మూవీ.. ఎప్పుడంటే ?

Visitors Are Also Reading