Telugu News » Blog » శరత్ బాబు చివరి సినిమా ఏంటో మీకు తెలుసా ?

శరత్ బాబు చివరి సినిమా ఏంటో మీకు తెలుసా ?

by Anji
Ads

ప్రముఖ  సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మే 22,2023న సాయంత్రం సమయంలో మరణించిన విషయం తెలిసిందే. శరత్ బాబు హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్ , హిందీ భాషల్లో దాదాపు 3000లకి పైగా సినిమాల్లో నటించారు. ఆయన అకాల మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

Advertisement

శరత్ బాబు 2014 తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. చివరిసారిగా శరత్ బాబు తెలుగులో 2021లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో వెండితెరపై కనిపించారు. ఇక తమిళ్ లో ఇటీవలే వచ్చిన ‘వసంత ముల్లై’ అనే సినిమాలో కనిపించారు. అయితే శరత్ బాబు చివరి సినిమా త్వరలోనే   కానుంది.

Advertisement

MS రాజు దర్శకత్వంలో నరేష్ , పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమాలో శరత్ బాబు నటించిన ఈ సినిమాలో శరత్ బాబు , జయసుధ కలిసి నటించారు. ఆయన చివరిసారిగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నరేష్ , పవిత్ర కథతో తెరకెక్కుతుండడంతో ఆయన సూపర్ స్టార్ కృష్ణ పాత్ర వేసినట్టు సమాచారం. కానీ అంతలోనే ఆయన మరణించడంతో చిత్ర యూనిట్ కూడా విషాదంలో మునిగింది. శరత్ బాబు చివరిసారిగా మళ్లీ పెళ్లి సినిమాలో వెండితెరపై చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం శరత్ బాబుని చూడాలనుకుంటే చూసేయండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బాలయ్య, రజినీ, శివరాజ్ కుమార్ లతో మల్టీస్టారర్ మూవీ.. ఎప్పుడంటే ?

Advertisement

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

 

You may also like