Home » లైగ‌ర్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్.. కీల‌క సీన్లు క‌ట్‌..!

లైగ‌ర్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్.. కీల‌క సీన్లు క‌ట్‌..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒక‌రైన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నారు. లైగ‌ర్‌కి ఆదిలోనే చుక్కెదురైంది. ఈనెల 25న దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది. హీరో విజ‌య్ తో పాటు ద‌ర్శ‌కుడు పూరిజ‌గన్నాథ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్ శంక‌ర్ కొంత ధైర్యాన్ని అందించింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కిన లైగ‌ర్ సినిమా హిట్ అయితే పూరి ఈజ్ బ్యాక్ అని అంతా అనుకుంటారు. ఈ సినిమా త‌రువాత కూడా పూరి మ‌రో పాన్ ఇండియా మూవీ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:   వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?

Advertisement

లైగ‌ర్ సినిమాలో ర‌మ్య‌కృష్ణ విజ‌య్ త‌ల్లి పాత్ర‌ను పోషిస్తుంది. హీరోయిన్ గా అన‌న్య పాండే న‌టిస్తుండ‌గా.. మ‌రో కీల‌క పాత్ర‌లో బాక్స‌ర్ మైక్ టైస‌న్ న‌టిస్తున్నాడు. రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు మెంబ‌ర్స్ భారీ షాకిచ్చారు. సినిమాలో అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలున్న‌ట్టు గుర్తించారు. ఇక ఈ సినిమాకి వ‌చ్చిన జ‌నాలు ఇబ్బందిక‌రంగా ఫీల‌వుతార‌ని భావించి సినిమాలో మొత్తం 7 సీన్ల‌ను తొల‌గించాల‌ని మూవీ మేక‌ర్స్‌కి బోర్డు స‌భ్యులు కోరారు. ఇక్క‌డ షాకింగ్ విష‌యం ఏంటంటే లైగ‌ర్ సినిమా మొత్తానికి ఈ సీన్స్ హైలైట్‌గా మారుతాయ‌ని మూవీ టీం చెబుతుంది.

Advertisement

ఇవి కూడా చదవండి: పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా..?

పూరి జ‌గ‌న్నాథ్ వంటి మాస్ డైరెక్ట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో అంటే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు బారీగానే ఉంటాయి. ఇక బోల్డ్ సీన్స్ బోల్డ్ డైలాగ్స్ క‌చ్చితంగా ఉండాల‌నుకుంటారు. ఈ సినిమాకి హైలెట్ అయిన ఆ ఏడు సీన్స్ ని సెన్సార్ స‌భ్యులు క‌ట్ చేయాల‌ని చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ సినిమాకి గుండెకాయ వంటి ఆ సీన్ల‌ను క‌ట్ చేస్తే ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్న‌గా మారింది. సెన్సార్ రివ్యూ ప్ర‌కారం.. ఆ సీన్స్ క‌ట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్ప‌డం క‌ష్టం అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఇక విడుద‌ల‌కు ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాకి భారీ షాక్ త‌గిలిన‌ట్టు అయింది. ఇక‌ ఈ సినిమా విడుద‌లైన త‌రువాత‌ విజ‌య్ పూరి-విజ‌య్ కాంబినేష‌న్ హిట్ అవుతుందా..? లేదా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:  మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఉద‌య్ కిర‌ణ్ 10 సినిమాలు…? ఈ సినిమాలు చేసుంటే టాలీవుడ్ బాద్షా అత‌డే..!

Visitors Are Also Reading