Home » మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఉద‌య్ కిర‌ణ్ 10 సినిమాలు…? ఈ సినిమాలు చేసుంటే టాలీవుడ్ బాద్షా అత‌డే..!

మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఉద‌య్ కిర‌ణ్ 10 సినిమాలు…? ఈ సినిమాలు చేసుంటే టాలీవుడ్ బాద్షా అత‌డే..!

by AJAY
Ad

చిత్రం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ మొదటి సినిమాతోనే అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో యువ‌త‌లో ఉద‌య్ క్రేజ్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఆ త‌ర‌వాత వ‌రుస‌గా రెండు హిట్ లు అందుకుని హాట్రిక్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్న స‌మ‌యంలో అనుకోని సంఘ‌ట‌న‌లు అత‌డి జీవితాన్ని త‌ల‌కిందులు చేశాయి.

ఇవి కూడా చదవండి:  పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా..?

Advertisement

udaykiran

udaykiran

ఏకంగా ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ప్రారంభించిన ప‌ది సినిమాలు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..స్టార్ డైరెక్ట‌ర్ ఎఎం ర‌త్నం నిర్మాణంలో ఖుషి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర‌వాత ప్రేమంటే సులువుకాదురా సినిమా ప్రారంభమైంది. 80శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ఆదిశంక‌రాచార్య సినిమాను అనుకున్నారు.

udaykiran

udaykiran

భారీ బ‌డ్జెట్ తో సినిమాను నిర్మించాల‌ని అనుకోగా నిర్మాత ఆర్థిక స‌మ‌స్య‌లు..ఉద‌య్ కిర‌ణ్ గ్రాఫ్ ప‌డిపోవ‌డం లాంటి కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే ఈ సినిమా ఆగిపోయింది. పూరి జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆసిన్ హీరోయిన్ గా ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. ఈ సినిమాను కూడా మ‌ధ్య‌లోనే ఆపేశారు. బాల‌య్య ద‌ర్శ‌క‌త్వంతో పాటూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన న‌ర్త‌న‌శాల సినిమాలో ఉద‌య్ కిర‌ణ్ ను అభిమ‌న్యుడి పాత్ర‌కు ఎంపిక‌చేశారు. ఈ సినిమా సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డంతో మ‌ధ్య‌లోనే ఆపేశారు. బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన జ‌బ్ వి మెట్ సినిమాను తెలుగులో ఉద‌య్ కిర‌ణ్ త్రిష జంట‌గా తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు.

Advertisement

ఇవి కూడా చదవండి:  వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?

ఈ సినిమా కూడా ఆగిపోయింది. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ‌సంస్థ ఉద‌య్ కిర‌ణ్ స‌దా జంటగా ఓ సినిమాను ప్లాన్ చేయ‌గా ఈ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. ఆ సినిమా కు కూడా బ్రేక్ ప‌డింది. అంతే కాకుండా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌కత్వంలో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ఓ ప్రేమ‌క‌థ‌ను అనుకున్నారు. ఆ సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. ఉద‌య్ కిర‌ణ్ తో మూడు సినిమాలు చేసిన తేజ మ‌రో సినిమా చేయాల‌ని కూడా అనుకున్నాడు. కానీ అది ప‌ట్టాలెక్క‌లేదు. ప్ర‌త్యూష క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉద‌య్ కిర‌ణ్ అంకిత జంట‌గా ఓ సినిమా అనుకున్నారు. ఆ సినిమా కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

ఇవి కూడా చదవండి:   సావిత్రి అలా దిగజారిపోకూడదు కదా అంటూ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్….!

Visitors Are Also Reading