Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనే కోరిక ఉందంటున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనే కోరిక ఉందంటున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

by Anji
Ads

పుష్ప సినిమాతో పాణించేస్తారుగా మారిపోయారు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అనే బిరుదు మారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చేసింది పుష్ప చిత్రం. టాలీవుడ్ అగ్ర దర్శకులు ఒకరైనటువంటి సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్రచందనం స్మోకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్  లుక్కులో స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా ఇందులో బన్నీ మేకోవర్.. నటనకు ఉత్తరాది ఆడియన్స్ తో పాటు డైరెక్టర్లు కూడా ఫిదా అయిపోయారు. ప్రస్తుతము ఈ సినిమా రష్యాలో విడుదలవుతోంది.

Advertisement

Ad

రష్యాలో విడుదలవుతున్న పుష్ప సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ తో పాటు అల్లు అర్జున్ రష్మిక మందన సందడి చేస్తున్నారు. ఇక బన్నీతో కలిసి సినిమా చేయడం తనకు చాలా ఇష్టం అన్నారు బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతము ఆయన రూపొందించిన సర్కస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.  తాజాగా సర్కస్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది.
Rohit Shetty Manam News
తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న రోహిత్ శెట్టి సౌత్ హీరోస్ గురించి ఆసక్తికరమెంట్ కామెంట్లు చేశారు. తనకు సౌత్ హీరోస్ అజిత్ కుమార్, అల్లు అర్జున్, కార్తీలతో కలిసి  పని చేయడం ఇష్టం అన్నారు.  ముగ్గురు హీరోలతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతీ హీరోతో కలిసి సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. అజిత్, విజయ్, అల్లు అర్జున్, కార్తీతో పాటు అందరితో కలిసి పని చేయడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు రోహిత్ శెట్టి.
Visitors Are Also Reading