Home » హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే ?

హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే ?

by Anji
Ad

హిట్ సీరిస్ పై ఇప్పటికే భారీగా క్రేజ్ ఏర్పడింది. హిట్ ది ఫస్ట్ కేసు అనే క్రైమ్ త్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయమయ్యారు శైలేష్ కోలన్. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే హిట్ సాధించారు. ఆయన హిట్టు యూనివర్స్ నీ రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్. హిట్ కేసు వన్ లో విశ్వక్సేన్ హీరోగా నటించాడు. ఇటు టు లో అడవి శేషు హీరోగా నటించారు. స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

ఇందులో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయకులుగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి రేటుకు అమ్ముడు పోయాయి. ఓటిపి సంస్థ అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. టీజర్ ట్రైలర్ తో పాటు సినిమా ప్రమోషన్స్ తో మేకర్స్ క్యూరియాసిటీని పెంచేశారు. ఇవాళ ఉదయం నుంచి ఈ చిత్రానికి సంబంధించి చాలా వరకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా మరో నెల రోజుల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read :  దిల్ రాజు గురించి ఆ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్ ! పవన్ చెప్పే వరకు ఎవరికీ తెలియదట

 

మరోవైపు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ హిట్ యూనివర్స్ థర్డ్ పార్ట్ కూడా రాబోతోంది. ఇందులో నాని హీరోగా నటించబోతున్నట్టు హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. అడివి శేషు సైతం నటించనున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు హిట్ 3 లో విశ్వక్ సేన్ కూడా నటించనున్నట్లు సమాచారం.  హిట్ 3 పట్టాలపైకి ఎప్ఫుడు వెళ్తుందో వేచి చూడాలి మరి.

Also Read :  పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి ఎందుకు రాలేదో అసలు విషయాన్ని బయటపెట్టిన ఆలీ..!

Visitors Are Also Reading