Home » శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 విడుదలయ్యేది అప్పుడే..?

శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 విడుదలయ్యేది అప్పుడే..?

by Anji
Ad

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ మూవీ 2021లో విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేసారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా గోపాల గోపాల పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడ ఓ మై గాడ్ మూవీకి సీక్వెల్ సిద్ధం అయింది. అయితే ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

Advertisement

ఈ సారి అక్షయ్ కుమార్ శివుడి అవతారంలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఓ మై గాడ్ 2 మూవీకి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ టీజర్ ని విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. 2021లో విడుదలైన సూర్యవంశీ తరువాత అక్షయ్ చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. బచ్ఛన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు వంటి అనేక ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక ఏడాది విడుదలైన సెల్పీ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అక్షయ్ ఆశలన్ని ఓ మైగాడ్ సీక్వెల్ మీదనే ఉన్నాయి. 

Advertisement

రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ఆగస్టు 11న విడుదలైన చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఈ సినిమా రేసు నుంచి తప్పుకుంది. ఈ తరుణంలోనే ఓఎంజీ 2 రేసులోకి వచ్చింది. ఆగస్టు 15న సెలవు ఉండటంతో మూవీ కలెక్షన్లు పెరిగేందుకు దోహదపడుతుందనే కారణంతో మేకర్స్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. అమిత్ రాయ్ ఓ మై గాడ్ 2 కి దర్శకత్వం వహిస్తున్నారు. శివ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. పంకజ్ త్రిపాఠి, అరుణ్ గోవిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ విజయం అక్షయ్ కుమార్ అత్యంత కీలకమనే చెప్పాలి. అందుకోసమే భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ మళ్లీ ఆ పాత్రలోనా..?

Honey Rose: హనీ రోజ్ కు అంత క్రేజ్ ఉన్నా పాపులారిటీ ఎందుకు రావడం లేదు? కారణం అదేనా?

Visitors Are Also Reading