Home » Honey Rose: హనీ రోజ్ కు అంత క్రేజ్ ఉన్నా పాపులారిటీ ఎందుకు రావడం లేదు? కారణం అదేనా?

Honey Rose: హనీ రోజ్ కు అంత క్రేజ్ ఉన్నా పాపులారిటీ ఎందుకు రావడం లేదు? కారణం అదేనా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మలయాళీ హీరోయిన్ హనీ రోజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోయిన్ గా ఈ మధ్య భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళీ నుంచి వచ్చినా.. తెలుగునాట చాలా తక్కువ టైం లోనే పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆమె. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి.

Advertisement

ఆమె ఇటీవల ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల కంటే ఆమె ఈవెంట్స్ లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లినా అక్కడ ఆమెను చూడడానికి జనం క్యూ కడుతూ ఉంటారు. ఇలా చాలా తక్కువ టైం లోనే ఆమె స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆమెకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు ఇంత క్రేజ్ ఉన్నా అవకాశాలు మాత్రం తక్కువగానే వస్తున్నాయి.

Advertisement

2005లోనే మలయాళం ఇండస్ట్రీ కి ఈమె పరిచయం అయ్యారు. 2014లో వరుణ్ సందేశ్ తో “ఈ వర్షం సాక్షిగా” సినిమాతో తెలుగు వాళ్ళకి కూడా పరిచయం అయ్యారు. కానీ ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో మళయాళంలోనే ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. తాజాగా.. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మంచి క్రేజ్ లభించింది. అయినా అవకాశాలు తక్కువ అయ్యాయి. కారణం ఏంటంటే.. ఈమె ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదట.

మరిన్ని ముఖ్య వార్తలు:

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

రోహిత్ 2011 ప్రపంచకప్‌ ఆడకుండా ధోనీ కుట్రలు ?

దిల్ రాజు రెండవ భార్య తేజస్విని బ్యాక్ గ్రౌండ్ ఇదే…!

Visitors Are Also Reading