Home » ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ మళ్లీ ఆ పాత్రలోనా..?

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ మళ్లీ ఆ పాత్రలోనా..?

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి మూవీ తరువాత అన్నీ పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు ప్రభాస్. ఇటీవలే ఆదిపురుష్ మూవీలో శ్రీరాముడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే సలార్ మూవీ సెప్టెంబర్ 28 న విడుదలవుతోంది. ఇదిలా ఉంటే..  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ మూవీలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకునే కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఇప్పటికే 70 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుందట ఈ మూవీ. ఎక్కువగా ఇందులో గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. ఇందులో పురాణాలకు సంబంధించిన పాత్రలను ఎలివేట్ చేసి వాటికనుగుణంగ కథను తీర్చిదిద్దినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అమితాబచ్చన్ పాత్రను అశ్వద్దామ స్ఫూర్తితో తీర్చిదిద్దారని అన్నారు. తాజాగా ఇప్పుడు ప్రభాస్ పాత్ర గురించి ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ప్రభాస్ విష్ణువు అవతారంలో కనిపించనున్నారట. విష్ణు పాత్ర స్ఫూర్తితో తీర్చిదిద్దారన్న మాట. ప్రభాస్ విష్ణువుగా కనిపిస్తున్నాడటంటే అభిమానులు సంబురపడిపోతున్నారు. ఇది వాస్తవమో కాదో.. తెలియదు కానీ దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Advertisement

మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ఐదు సుదీర్ఘమైన యాక్షన్ బ్లాక్ లు ఉన్నట్టు సమాచారం. వీటిని రూపొందించడానికి హాలీవుడ్ యాక్షన్ దర్శకులను రంగంలోకి దించారట. ఎప్పుడూ చూడనివిధంగా భారీ విజువల్ మూవీగా అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ గా వస్తుందని దర్శక, నిర్మాతలు పేర్కొంటున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. అత్యున్నత స్థాయిలో వీఎఫ్ఎక్స్ హంగులను తీర్చిదిద్దుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో.. గత సినిమాలా మాదిరిగా నెగటివ్ టాక్ సంపాదించుకుంటుందో.. మరీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో లేదో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పూనమ్ కౌర్ స్టోరీ వైరల్.. అసలు వారు గురువు కాదు..!

 Krithi Shetty: బర్త్‌డే పార్టీకి రమ్మని కృతికి టార్చర్.. స్టార్ హీరో కొడుకు వేధింపులు!

Visitors Are Also Reading