Telugu News » Blog » మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

by Bunty
Ads

 

రష్మిక మందన్న… ఈ హీరోయిన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయిన ఈ హీరోయిన్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమా తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తెలుగులో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఇక వరుస వివాదాలతో ట్రోలింగ్ సుడిగుండంలో చిక్కుకున్న రష్మిక మొదట్లో దీనిపై తెగ ఆందోళన చెందేది.

Advertisement

read also : కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

Advertisement

కానీ రాను రాను వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు ట్రై చేస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది రష్మిక. చిన్న చిన్న విషయాలు కూడా నాకెంతో ముఖ్యమైనవి. నేను లేవగానే నాకు కుక్క పిల్లలతో ఆడుకుంటాను. అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఆ మాటలతో మనిషిని నిలబెట్టవచ్చు.

అదే మనిషి మనసు ముక్కలు చేయవచ్చు. నేను నా డైరీలో ప్రతి చిన్న విషయాలు కూడా రాసుకుంటాను. అందులో ఒకటి ఏంటో తెలుసా? నేను ఇంటికి రాగానే అందరి పాదాలకు నమస్కరించాలి. నా కుటుంబ సభ్యులవి మాత్రమే కాదు, మా ఇంట్లో ఉండే పని వాళ్ళ కాళ్లకు సైతం నేను నమస్కరిస్తాను. వాళ్లని వేరుగా చూడను. నాకు అందరిని గౌరవించడం మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చింది.

Advertisement

READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

You may also like