Home » బీజేపీ జాతీయ సదస్సు..మోడీ ఐడీ కార్డ్ వైరల్..!

బీజేపీ జాతీయ సదస్సు..మోడీ ఐడీ కార్డ్ వైరల్..!

by Anji
Ad

భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ మహాసభలు శనివారం నుంచి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ సదస్సును ప్రారంభించారు. బీజేపీ జాతీయ మహాసభల సందర్భంగా హాజరైన వారు డిజిటల్ ఐడీ కార్డులతో కనిపించారు. బిజెపి జాతీయ సమావేశం మధ్య ప్రధాని మోడీకి సంబంధించిన ఐడీ కార్డు వెలుగులోకి వచ్చింది. ఈ ఐడీ కార్డు 2009లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ మహాసభలు జరిగినప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరైన నాటిది.

Advertisement

Advertisement

ప్రధాని మోదీకి సంబంధించిన ఈ 2009 గుర్తింపు కార్డు @modiarchive ఎక్స్ లో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం 2009 జూన్ 20-21 తేదీలలో న్యూఢిల్లీలో జరిగినట్లు గుర్తింపు కార్డులో చూడవచ్చు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ ఐడీ కార్డుపై గుజరాత్ ముఖ్యమంత్రి అని రాశారు. విశేషమేమిటంటే.. కాలక్రమేణా బీజేపీ జారీ చేసే ఐడీ కార్డు రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఐడీ కార్డ్ డిజిటల్ రూపంలో కనిపిస్తుంది. ప్రధాని మోడీ 15 ఏళ్ల నాటి ఐడీ కార్డు ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం.

Also Read :   “రాజకీయాలు మనకెందుకు నాన్న ఎన్టీఆర్” ని ప్రశ్నించిన పురందేశ్వరి కి ఇచ్చిన సమాధానం ఏమిటంటే !

Visitors Are Also Reading