Home » బింబిసార ఓటీటీ విడుదల ఎందులో.. ఎప్పుడో తెలుసా..?

బింబిసార ఓటీటీ విడుదల ఎందులో.. ఎప్పుడో తెలుసా..?

by Azhar
Ad

కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా విడుదల అయిన సినిమా బింబిసార. అయితే ఈ సినిమా అనేది భారత దేశ చరిత్రలోని ఒక్క రాజు జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసిన సమయంలో కానీ.. విడుదలకు ముందు కానీ పెద్దగా హైప్ అనేది లేదు. అలా కామ్ గా విడుదల అయిన ఈ బింబిసార సూపర్ హిట్ గా నిలిచింది. ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ కూడా అందుకుంది.

Advertisement

అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో జనాలు అందరూ ఈ సినిమా యొక్క ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యే కాలంలో సినిమాను థియేటర్లో చూసే వారికంటే ఓటీటీలో చూసే వారి సంఖ్య అనేది పెరుగుతూనే పోతుంది. అందుకే తాజాగా విడుదల అవుతున్న సినిమాలు అన్ని ఓటీటీలో ఆలస్యంగా వస్తాం అని చెప్పుకుంటున్నాయి. సినిమా హిట్ అయితే అలానే చేస్తున్నాయి.

Advertisement

ఒకవేళ సినిమా ప్లాప్ అయితే ముందుగానే ఓటీటీలోకి వచేస్తున్నాయి. అయితే ఇప్పుడు బింబిసార సినిమా హిట్ కావడంతో ముందు అనుకున్న విధంగానే 8 వరాల తర్వాతే ఓటీటీ లోకి రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుంది అనేది తాజాగా విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు జీ5 ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ ను కూడా ఇదే సంస్థ తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

21 ఏళ్ళ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్…!

Visitors Are Also Reading