Home » నాకు ఏదైనా అయితే ఈ ఐదుగురే కారణం.. పల్లవి ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

నాకు ఏదైనా అయితే ఈ ఐదుగురే కారణం.. పల్లవి ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anji
Ad

ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా హౌస్ లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మేదులుతూ అందరి మనసులను గెలుచుకున్నాడు ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చాడు చివరికి అందర్నీ వెనక్కి నెట్టి బిగ్బాస్ సెవెన్ టైటిల్ను ఎగిరేసుకుపోయాడు. కానీ ఈ ఆనందం ఒక్క రోజులోనే ఆవిరి అయిపోయింది. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై ప్రభుత్వ ఆసులపై దాడి జరిగింది.

Advertisement

శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంతును అక్కడ ఆగకుండా వెంటనే వెళ్ళిపోమన్నారు పోలీసులు ఇతడు మాత్రం రైతు బిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించారు బయటకు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి పోలీసుల ఆదేశాలను బేకాతలు చేస్తూ ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియో కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక వాతావరణం నెలకొంది. పబ్లిక్ న్యూసెన్స్ కు కారణం అయ్యారు అంటూ పల్లవి ప్రశాంతును పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. అయితే తాను అరెస్టు కావడానికి ముందు ప్రశాంత్ అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ.. నాకు సరిగ్గా తిండి నిద్ర లేదు కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాడు. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్ళు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురు ఐదుగురి ఫోటోలు వీడియోలు మా వాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఏమైనా అయితే వాళ్లదే బాధ్యత.

Advertisement

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేనే పరేషాన్ అయ్యాను నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా అనుకున్నాను పోలీసులు వెనక గేటు నుంచి వెళ్ళమన్నారు కానీ నేను ఒప్పుకోలేదు నాకోసం అంతమంది వచ్చారు నేను ఒక దొంగలా వెనుక నుంచి వెళ్ళను ముందుకేటు నుంచే వెళ్తానని చెప్పాను వాళ్లు ఇంకా ఏమని చెప్పారు ఆ రణ గోల ధ్వనుల మధ్య నాకు వినపడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు కానీ అప్పుడు నాకు ఏదీ సరిగ్గా వినపడకపోవడంతో అలాగే ముందుకు వెళ్లాను కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ నాకు ఏదైనా అయినా నా ఇంట్లో వాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటికి వస్తాయని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading