Telugu News » Blog » IPL 2023 : ఐపీఎల్ కు ముందే..KKR కు ఎదురుదెబ్బ

IPL 2023 : ఐపీఎల్ కు ముందే..KKR కు ఎదురుదెబ్బ

by Bunty
Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. అయితే, ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే కోల్కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరహాలోనే తమ కెప్టెన్ సేవలను ఆ జట్టు కోల్పోయింది.

Advertisement

 

Advertisement

వెన్ను గాయం తిరగబెట్టడంతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ లో బ్యాటింగ్ కు రాని శ్రేయస్ అయ్యర్ చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఫీల్డింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ కు రాలేదు. ఈ మ్యాచ్ జరుగుతుండగానే అయ్యర్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ కు ముందు వెన్ను గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యార్, నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా తోలి టెస్ట్ ఆడని అయ్యర్, ఢిల్లీ టెస్ట్ తో రియల్ ఇచ్చాడు. ఆ మ్యాచ్లో విఫలమైన అయ్యార్, ఇండోర్ టెస్ట్ లో పరవాలేదనిపించాడు. ఇక అహ్మదాబాద్ టెస్ట్ లో గాయం తిరగబెట్టడంతో బ్యాటింగ్ కు రాలేదు. అయ్యర్ గాయం తీవ్రత నేపథ్యంలో ఆసీస్ తో వన్డే సిరీస్ నుంచి అతన్ని బీసీసీఐ తప్పించింది.