Home » Big boss6 telugu faima Pataas :ఫైమాకు అదిరిపోయే ఆఫరివ్వబోతున్న బిగ్ బాస్.. ముందే అగ్రిమెంట్ జరిగిందా..?

Big boss6 telugu faima Pataas :ఫైమాకు అదిరిపోయే ఆఫరివ్వబోతున్న బిగ్ బాస్.. ముందే అగ్రిమెంట్ జరిగిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు బుల్లితెర రియాలిటీ షోలో బిగ్ బాస్ ఎంతటి ఆదరభిమానాలు పొందిందో మనందరికీ తెలుసు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది.. ముచ్చటగా 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ మొదట్లో కాస్త రేటింగ్ లో వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత వారం వారం గడిచిన కొలది అనుకోని ఎలిమినేషన్లతో బిగ్ బాస్ పై హైప్ పెరిగిపోయింది. దీంతో రేటింగ్ కాస్త పెరుగుకుంటూ వచ్చింది. ఈ విధంగా 14వ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ 13వ వారం ఎండింగ్ లో టాప్ ఫైవ్ లో ఉంటుందనుకున్న ఫైమా ఎలిమినేట్ అయింది.. దీంతో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి..

Advertisement

also read:మిర‌ప‌కాయ్ సినిమాను చేతులారా వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఏంటని కాస్త వ్యతిరేక వర్షాలు కూడా కురిశాయి.. కానీ బిగ్ బాస్ లో మొదటి నుంచి ఎంతో పర్ఫామెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిన ఫైమా 11, 12 వారాల్లో తన కన్నింగ్ మైండ్ ను బయటపెట్టింది.. దీంతో ఆమెను అభిమానించే వారంతా హర్ట్ అయిపోయారు.. కానీ faima shiek ఏమాత్రం బాధపడకుండా బిగ్ బాస్ నన్ను ఇక్కడ వరకు తీసుకురావడమే గొప్ప అంటూ ఫీల్ అయిపోయింది.. తను ఉన్నన్ని రోజులు హౌస్ లో అందరిని ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు సాగింది.

Advertisement

అలాంటి ఫైమా 13 వారాలు ఉన్నందుకు మూడున్నర లక్షల పారితోషికం అందుకుంది.. కానీ ఆమె అభిమానులు మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు.. అంతటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా పెట్టారు.. కానీ ఆమె ఎలిమినేషన్ వెనుక ఒక పెద్ద బలమైన కారణం ఉందట.. త్వరలో బిగ్ బాస్ ఒక కామెడీ షోని కూడా ప్రారంభించాలని భావిస్తున్నారట.. ఈ షోకి ఫైమాను హోస్టుగా తీసుకురావాలని వారు అనుకున్నట్లు సమాచారం.. ఈ అగ్రిమెంట్ ఫైమా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందే జరిగిందని, పైమా ఎలిమినేట్ అయినా కానీ బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading