Home » మిర‌ప‌కాయ్ సినిమాను చేతులారా వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

మిర‌ప‌కాయ్ సినిమాను చేతులారా వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

కొన్ని సూప‌ర్ హిట్ సినిమాలు త‌మ వ‌ద్ద‌కే మొద‌ట వ‌చ్చినా క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతోనో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో హీరోలు మిస్ చేసుకుంటారు. అలా ప్ర‌తి హీరో కెరీర్ లోనూ కొన్ని సినిమాలు ఉంటాయి. అలాగే ర‌వితేజ హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా మిర‌ప‌కాయ్ ని మిస్ చేసుకున్న హీరో కూడా ఒక‌రు ఉన్నారు. మిర‌ప‌కాయ్ సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించ‌గా ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో రిచా గంగోపాద్యాయా, దీక్షా సేత్ హీరోయిన్ లుగా న‌టించారు.

Advertisement

సినిమా మాస్ ఓరియెంటెడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా చాలా స్పైసీగా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. సినిమాలో ర‌వితేజ రిచా మ‌ధ్య ఉండే ల‌వ్ ట్రాక్..సునీల్ తో ర‌వితేజ కామెడీ అదే విధంగా ర‌వితేజ చేసే యాక్ష‌న్ ఇలా సినిమాలో అన్నీ క‌లిసి ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ లా అనిపించింది సినిమా. అయితే ఈ సినిమా క‌థ‌ను హ‌రీష్ శంక‌ర్ మొద‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం రాసుకున్నాడ‌ట‌.

Advertisement

కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయ‌డంతో ఆ ఆఫ‌ర్ ర‌వితేజ వ‌ద్ద‌కు వెళ్లింది. అంతే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ విష‌యాన్ని ర‌చ‌యిత కోన వెంక‌ట్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బాలు సినిమా స‌మ‌యంలో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత తాము క‌లిసి గుడుంబా శంక‌ర్ సినిమాకు కూడా ప‌నిచేశామ‌ని చెప్పారు. ఆ సినిమా స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డింద‌ని అన్నారు.

Harish Shanker

Harish Shanker

అంతే కాకుండా తీన్మార్ సినిమాకు కూడా తాము క‌ల‌సి పని చేశామ‌ని చెప్పారు. ఆ సినిమా స‌మ‌యంలో ప‌వ‌న్ త‌న‌తో ద‌బాంగ్ సినిమాను రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పాడ‌ని తెలిపారు, ఏ ద‌ర్శ‌కుడితో చేస్తే బాగుంటుంద‌ని అడ‌గ్గా తాను హ‌రీష్ శంక‌ర్ పేరు చెప్పాన‌ని అన్నారు. దాంతో ప‌వ‌న్ తాను హ‌రీష్ శంక‌ర్ చెప్పిన మిర‌ప‌కాయ్ సినిమాను మిస్ చేసుకున్నాన‌ని దాంతో ద‌బాంగ్ సినిమా రీమేక్ అత‌డితో చేయాల‌ని త‌న మ‌న‌సులో కూడా ఉంద‌ని తెలిపిన‌ట్టు పేర్కొన్నారు.

Visitors Are Also Reading