Home » Big boss6: నడవలేని స్థితిలో శ్రీ సత్య తల్లి.. వీల్ చైర్ లోనే హౌస్ లోకి ఎంట్రీ..!!

Big boss6: నడవలేని స్థితిలో శ్రీ సత్య తల్లి.. వీల్ చైర్ లోనే హౌస్ లోకి ఎంట్రీ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా జోరుగా సాగుతోంది. ప్రతి వారం ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ విధంగా ఎలిమినేట్ అయి కొంతమంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లడంతో హౌస్ లో ఉన్న వారి ఆట తీరు మరింత పెరుగుతోంది. ఈ తరుణంలోనే హౌస్ లోకి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య కూతురితో పాటు రాజు వాళ్ళ తల్లి హౌస్ లోకి వచ్చింది. వీరి రాకతో ఆదిరెడ్డి, రాజులలో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో మిగతా కంటెస్టెంట్లు కూడా వారి కుటుంబీకులు వస్తారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఫైమా మరియు శ్రీ సత్య వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్లు తాజాగా వచ్చిన ప్రోమో ద్వారా అర్థమవుతుంది.

Advertisement

వారి తల్లిని చూసిన ఫైమా ఆనందంతో ఎగిరి గంతేసింది. తల్లిని గట్టిగా పట్టుకుని ముద్దుల వర్షం కురిపించింది అని చెప్పవచ్చు. తన తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని కబుర్లు కూడా చెప్పింది. నువ్వు ఇంగ్లీష్ అందరికీ నేర్పిస్తున్నావ్.. నాక్కూడా నేర్పించు అంటూ కూతురుపై సెటైర్ వేసింది..ఇందులో ఉన్న ఫైమా కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో చెప్పండి అని శ్రీ సత్య అడగ్గా అందరూ ఇష్టమే అని సమయస్ఫూర్తితో తప్పించుకుంది. పక్కనే ఉన్న రేవంత్ ని చూస్తూ నిన్ను చూస్తే భయమేస్తుంది అనడంతో అతను గట్టిగా నవ్వారు.ఇక శ్రీ సత్య తల్లిని తలుచుకుంటూ బాధపడింది.. మా తల్లి కూడా నడుచుకుంటూ వస్తే బాగుండేది అంటూ కన్నీరు కూడా పెట్టింది.

Advertisement

also read:రోజా కోరిక తీరింది.. దత్త పుత్రిక డాక్టర్ అయింది..!!

ఈ టైంలోనే గార్డెన్ ఏరియా నుండి సోను అని పిలుస్తూ సత్య పేరెంట్స్ కూడా వచ్చారు. అయితే శ్రీ సత్య తల్లి అనారోగ్యం కారణంగా ఇంతకాలం నుండి నడవలేని పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా వీల్ చైర్ లో తీసుకొని వచ్చారు శ్రీ సత్య తండ్రి. వారి తల్లిదండ్రులను చూసిన సత్య కన్నీటిని అప్పుకోలేకపోయింది. వారిద్దరిని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసింది. తన తల్లికి అన్నం తినిపించింది. ఇక రాజు గురించి చెబుతూ.. ఫస్ట్ వీక్ లో నామినేట్ ఏమని చేశాడో తెలుసా డాడీ ‘ నువ్వు మాట్లాడుతున్నావ్ కానీ కనెక్షన్ కుదరలేదు అన్నాడు అంటూ శ్రీ సత్య చెప్పగా నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ చేస్తున్నావులే అని డాడీ అనడంతో మొహం చాటేసింది.. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ మొత్తం వారి యొక్క తల్లిదండ్రులతో నవ్వులు, ఏడుపులతో ప్రోమో బయటకు వచ్చింది. పూర్తి ఎపిసోడ్ మాత్రం మిస్ కాకండి.

also read:

Visitors Are Also Reading