Home » ఓటీటీలోకి తోడేలు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీలోకి తోడేలు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

by Anji
Ad

ఒకప్పుడు సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలా హంగామా ఉండేది. థియేటర్ల వద్ద రాత్రి నుంచి ఉదయం వరకు కాపు కాసి టికెట్ల కోసం నానా తంటాలు పడ్డారు. ప్రస్తుతం ఆన్ లైన్ బుకింగ్ కొనసాగుతున్న తరుణంలో ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూసే వారు చాలా తక్కువ అయ్యారనే చెప్పాలి. ఏదో పెద్ద హీరోల సినిమాలు అయితే ఎక్కువగా థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. 

Advertisement

ఇటీవల కాలంలో థియేటర్ లో విడుదలైన సినిమాలు దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, దసరా, బలగం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ సైతం నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేశాయి. కేవలం తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో కూడా ఇదే పరిస్థితి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయినా సరే నాలుగు వారాలు దాటిందంటే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఒక సినిమా కోసం మాత్రం ప్రేక్షకులు దాదాపు 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ఆ సినిమా ఏంటంటే.. వరుణ్ ధావణ్ హీరోగా నటించిన భేదియా మూవీ. 

Advertisement

Also Read :  దాల్చిన చెక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. పరిమితి దాటితే ప్రమాదం తప్పదు..!

ఈ సినిమాను తెలుగులో తోడెలు పేరుతో విడుదల చేసారు. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక జియో సినిమాలో మే 26 నుంచి భేదియా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ మూవీకి సీక్వెల్ గా భేదియా 2 కూడా రాబోతుంది. తోడెలుగా మారిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడో ఈ సినిమాలో చూపించారు. దీనికి వచ్చే సీక్వెల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో ఉంది. తోడెలు మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read :  Samantha : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో విడుదల…

Visitors Are Also Reading