సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను మనం తీసుకోకుంటే సమస్యలు వస్తాయి. అలా అని అధికంగా తీసుకున్నా కూడా ప్రమాదం పొంచి ఉంది. వాటిలో మనం నిత్యం వంట గదిలో వినియోగించే మసాలా దినుసులు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా బాగా ఉపయోగపడుతాయి. అటువంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి. అయితే ఏ వస్తువును అయినా పరిమితిని దాటితే అది విషంగా మారే అవకాశముంది అనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవడం బెటర్. దాల్చిన చెక్కను కూడా మోతాదుకు మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. మోతాదుకు మించి దాల్చిన చెక్కను తీసుకున్నట్టయితే జీర్ణ సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్ లకు దారి తీసే ప్రమాదముంటుంది. దాల్చిన చెక్కను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పడిపోయే ప్రమాదముంది. అదేవిదంగా రక్తపోటు కూడా తీవ్రంగా తగ్గిపోయే అవకాశాలుంటాయి. దీని ఫలితంగా మీకు మైకం, మత్తుగా అనిపిస్తుంది. గ్యాస్ సమస్య, శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్కను ఎక్కువగా వినియోగించడం ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
పరిమితి దాటితే దాల్చిన చెక్క కాలేయం ఆరోగ్యానికి హానీ కలిగిస్తుంది. మోతాదుకు మించినప్పుడూ ఇందులోని కొమారిన్ లివర్ పై ప్రతీకూల ప్రభావం చూపి దాని పనితీరును నెమ్మదింపజేస్తుంది. అందుకే మోతాదుకు మించకుండా తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
Also Read : ఎండాకాలంలో వీళ్లు అస్సలు పుచ్చకాయని తీసుకోకూడదు…!