Home » ప్రాంతీయ పార్టీల ఆదాయం డబుల్…BRSపై కనకవర్షం

ప్రాంతీయ పార్టీల ఆదాయం డబుల్…BRSపై కనకవర్షం

by Bunty
Ad

ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దేశంలోని 10 ప్రాంతీయ పార్టీలకు రూ.852 కోట్ల విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ తన నివేదికలో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయని తెలిపింది. 2021-22 లో దేశంలోని ప్రాంతీయ పార్టీలలో డీఎంకే రూ. 318 కోట్ల విరాళాలతో మొదటి స్థానంలో ఉండగా, ఒడిశాకు చెందిన బీజూ జనతా దళ్ రూ.307 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, టిఆర్ఎస్ పార్టీ రూ.218 కోట్లతో తర్వాత స్థానంలో ఉంది.

READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Advertisement

2021-22 సంవత్సరంలో డీఎంకే, బీజేడి, వైయస్సార్సీపి, బీఆర్ఎస్, జెడియు వంటి 10 ప్రాంతీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చినట్లు ఏడిఆర్ తన నివేదికలో తెలిపింది. ఈ సంవత్సరంలో మొత్తం 36 ప్రాంతీయ పార్టీలకు రూ.1213 కోట్ల విరాళాలు వచ్చాయని పేర్కొంది. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయని వెల్లడించింది. ఏడిఆర్ నివేదిక ప్రకారం, అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో డీఎంకే పార్టీ వాటా 26.27 శాతంగా ఉంది.

Advertisement

READ ALSO :  Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

Telangana: BRS assets up by 66% during 2021-22

ముఖ్యంగా బిఆర్ఎస్ కు రూ.180.45 కోట్ల విరాళాలు పెరగగా, డీఎంకే పార్టీకి రూ.168.79 కోట్లు అధికంగా విరాళాలు వచ్చాయని తెలుస్తోంది. 21 ప్రాంతీయ పార్టీలు 2021 లో తమ ఆదాయంలో కొంత భాగాన్ని కూడా ఖర్చు చేయలేదని పేర్కొంది. అయితే మరో 15 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కన్న ఎక్కువ ఖర్చు చేశాయని స్పష్టం చేసింది. డీఎంకే తన ఆదాయంలో రూ.283 కోట్లు ఖర్చు చేయలేదు. బిఆర్ఎస్, బిజెడి కూడా రూ.278 కోట్లు, రూ.190 కోట్లు ఖర్చు చేయలేదని ఏడిఆర్ వెల్లడించింది

READ ALSO :  Rishabh Pant:కర్రలతో రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌

Visitors Are Also Reading