Home » మీ ఒంట్లో వేడి ఎక్కువుందా.. తగ్గించుకోవడానికి చిట్కాలు ఇక్కడ చూడండి..?

మీ ఒంట్లో వేడి ఎక్కువుందా.. తగ్గించుకోవడానికి చిట్కాలు ఇక్కడ చూడండి..?

by Azhar
Ad

మామూలుగా కొంతమంది మనుషుల శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. వారికి అది కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలను తెస్తుంది. అయితే ఈ ఎండాకాలంలో ఆ వేడి అనేది ఒంట్లో మరీ ఎక్కువై వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అలా ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నవారికి దానిని తగ్గించుకోవడానికి ఎటువంటి చిట్కాలు ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో భోజనంలోకి పెరుగు అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఒంట్లో వేడిని తగ్గించడానికి ఈ పెరుగు నుండి మనం తయారు చేసుకునే మజ్జిగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజుకి మూడు లేదా నాలుగు గ్లాసుల మజ్జిగ తాగడం వల్ల ఒంట్లో వేడి అనేది చాలా తక్కువ అవుతుంది. అలాగే నిమ్మకాయ రసం కూడా ఒంట్లోని వేడిని తగ్గించడానికి ఎంతో మంచి ఔషధం. కానీ నిమ్మకాయ రసంలో ఉప్పు, చక్కర వంటివి ఏవి కలుపుకోకుండా తాగాలి. ఆలా తాగితేనే నిమ్మరసం వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Advertisement

ఇక వేడిని తగ్గించుకోవడానికి చాలా మంది చేసే పని కొబ్బరి నీళ్లు తాగడం. ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కేవలం ఒంటిలోని వేడి మాత్రమే కాదు… శరీరానికి ఎంతో ఆరోగ్యకరం కూడా. అందువల్ల కనీసం రోజుకు ఒక కొబ్బరి బొండం అయిన తాగాలి. అదేవిధంగా రాగులు కూడా మనిషి ఒంట్లోని వేడిని తీసేయడానికి ఎంతో సహాయ పడతాయి. మొదట రాగులను పౌడర్ గా చేసి… ఒక టీస్పూన్ పౌడర్ని రోజు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఒంటిలోని వేడి అనేది త్వరగా తొలగిపోతుంది. ఈ ఎండాకాలంలో ఈ చిట్కాలు అందరికీ చాలా ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి :

సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

ఢిల్లీకి షాక్.. కరోనా కారణంగా పాంటింగ్ జట్టుకు దూరం..!

Visitors Are Also Reading