Home » కాలి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్తో విసిగిపోతున్నారా..! అయితే ఈ రెమెడీ ట్రై చేసి చూడండి..!

కాలి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్తో విసిగిపోతున్నారా..! అయితే ఈ రెమెడీ ట్రై చేసి చూడండి..!

by Mounika
Ad

అందమైన చేతులు మరియు కాళ్ళు కూడా మన అందానికి సంకేతం.. వర్షాకాలంలో జలుబు మాత్రమే కాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా మనల్ని వేధిస్తాయి. ఈ వర్షాకాల సమయంలో ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చర్మాన్నికి దురద, మంట మరియు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా మనల్ని విసిగిస్తూ ఉంటాయి. వర్షంలో ఎక్కువ సేపు బూట్లు వేసుకోవడం వల్ల లేదా పాదాలను ఎక్కువసేపు నీటిలో ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది . అందుకే ఈ సీజన్‌లో పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పాదాలలో కాలి వేళ్ళ మధ్య ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎందుకంటే తేమ ఎక్కువ సమయం కాలి వేళ్ళ మధ్యలో ఉంటుంది. ఈ సమస్య అనేది రాత్రి నిద్ర సమయంలో మరింతగా వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు ఇంటిలో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే కాలి వేళ్ళ మధ్య ఏర్పడిన పంగల్ ఇన్ఫెక్షన్ నికి సంబంధించిన నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

#1. కొబ్బరి నూనె :

Advertisement

ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా పెరగకపోతే కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి కాలి వేళ్ళను ఆరోగ్యవంతంగా చేస్తాయి. దీని కోసం కొబ్బరి నూనెలో ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలిపి అప్లై చేయండి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫంగస్‌ను నయం చేస్తాయి.

#2.వెల్లుల్లి :

వెల్లుల్లిలో అజోన్ అనే ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఉండటం వలన యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను వెంటనే తొలగించడానికి బాగా పనిచేస్తుంది. దీని కోసం 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలను బాగా క్రష్ చేసి దాని రసాన్ని నాలుగైదు చెంచాల సేంద్రీయ కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 4 నుండి 5 నిమిషాలు వేడి చేసి గోరువెచ్చని నూనెని ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నచోట అప్లై చేయడం ద్వారా త్వరగా తగ్గ ముఖం పడుతుంది. ఇన్ఫెక్షన్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు కచ్చితంగా డాక్టర్ సంప్రదించి సరైన సలహా తీసుకోవడం మంచిది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఏ పాలు తాగడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందో తెలుసా..?

Health Tips: మీ గోళ్లు విరిగిపోతున్నాయా? అయితే ఇది మీకోసమే.. తప్పకుండ చదవండి!

Health tips: ఈ వేర్లు ఎక్కడ దొరికిన అసలు వదలకండి…! ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎంతో అవసరం..!

 

 

Visitors Are Also Reading