Home » ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లు తాగవచ్చా? రోజు తాగితే ఏమవుతుంది?

ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లు తాగవచ్చా? రోజు తాగితే ఏమవుతుంది?

by Bunty
Ad

వేసవిలో వేడిని తట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. దాహాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని నీళ్లు తాగేస్తుంటారు. వీటితోపాటు శీతల పానీయాలు, ఫ్రూట్ జ్యూస్ లు తినేవాళ్ళు కూడా ఎక్కువే. ఇక మందుబాబులైతే బీరును తాగి బజ్జుంటారు. వేసవి నుంచి తమను బీర్లే కాపాడతాయని ఫీలవుతుంటారు. చల్లని బీరు అలా గొంతు నుంచి జారుకుంటే, కడుపు చల్లగా ఉన్న భావన వారిలో కలుగుతుందట. అంతేగాక బీరంటే నీళ్లేనని, బీరు తాగితే నీళ్లు తాగినట్లేనని అనుకుంటారు.

READ ALSO : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?

Advertisement

బీర్లు తమని వేసవి తాపం నుంచే బయటపడే స్థాయిని నమ్ముతారు. వాస్తవానికి అది అపోహ మాత్రమే. వేసవిలో బీర్లు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. శరీరంలో ఏడిహెచ్ అనే హార్మోన్ ఉంటుంది. అది శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. ఆల్కహాల్ కలిసిన బీరు తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో బీర్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కేవలం బీరు మాత్రమే కాదు ఇతరత్రా ఆల్కహాల్ ల వల్ల కూడా శరీరానికి నష్టమే. చల్లటి బీరు వల్ల శరీరంలో వేడి మరింత పెరిగి కొత్త సమస్యలను తెస్తుందని పరిశోధకులు తెలిపారు.

Advertisement

READ ALSO: TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Hangovers: Wine, Beer Order Doesn't Matter

బీర్లకు బదులు జ్యూసులు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని బాటిళ్ల మీద బాటీలు ఎత్తేయకుండా నియంత్రించుకోండి. కిక్కు కోసం అప్పుడప్పుడు బీర్లు, ఇతరత్రా ఆల్కహాల్ ను పుచ్చుకున్న తక్కువ మోతాదులోనే తీసుకోండి. ఎందుకంటే, అతి ఎప్పటికీ అనార్థమే.

READ ALSO : ‘ఆరెంజ్’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల 5 కారణాలు ఇవేనా ?

Visitors Are Also Reading