మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించాడు. ఈ సినిమాతో చరణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ చిత్రం తరవాత రామ్ చరణ్ ఆరెంజ్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా జెనిలియా హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా గీత ఆర్స్ట్ బ్యానర్ పై ఈ సినిమాను నాగబాబు నిర్మించారు.
Advertisement
read also : TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!
Advertisement
ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హ్యారీస్ జయరాజ్ స్వరాలు సమకూర్చగా ఆడియోకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ మొదలవ్వడంతో పాటూ చరణ్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాను ఇప్పటికి టీవీ లో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఆరెంజ్ తమ ఫేవరెట్ సినిమా అని చెప్పుకునేవాళ్లు ఉన్నారు. చరణ్ సతీమణి ఉపాసనకు కూడా ఆరెంజ్ సినిమా అంటే చాలా ఇష్టమట. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొన్నికారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజమౌళి సినిమా తరవాత హీరోల క్రేజ్ పీక్స్ కు వెళ్లిపోతుంది. అలానే చరణ్ విషయంలో కూడా జరిగింది. మగధీర లో విరోచిత పోరాటం చేసిన చరణ్ ను లవర్ బాయ్ లుక్ లో చూసి ప్రేక్షకులు నిరాశచెందారట. అంతే కాకుండా సినిమా పాటలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి కానీ ఎంతమందినైనా ప్రేమించవచ్చు అనే కాన్సెస్ట్ కూడా అప్పుడు జనాలకు ఎక్కలేదు. ప్రేమిస్తానని చెప్పడం పెళ్లివద్దని చెప్పడం ప్రేక్షకులకు అసలు అర్థం కాలేదు. అంతే కాకుండా సినిమాలో జెనీలియ యాక్టింగ్ చూసి ఓవర్ యాక్టింగ్ అనుకున్నారు. జెనీలియ వల్లే సినిమా పోయిందని కూడా అన్నారు.
Advertisement
READ ALSO : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?