Home » సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట.. ఆ హీరో సలహా మేరకేనా?

సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట.. ఆ హీరో సలహా మేరకేనా?

by Anji
Ad

సాధారణంగా బతుకమ్మ పండుగ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం అయినటువంటి బతుకమ్మ పండుగను దాదాపు 9 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో బతుకమ్మ పండుగ అంటే తెలియని వారుండరు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. కాబట్టి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాటను ఏర్పాటు చేశారు. 

Also Read :  ‘దసరా’ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా కిసి కా భాయ్ కిసీ కి జాన్. ఈ చిత్రంలో పూజా హేగ్దె కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. పూజాకి అన్నయ్యగా కనిపించనున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను తెలిపేవిధంగా ఈ పాటను రూపొందించారు. తాజాగా కిసీ కా భాయ్ కిసీకి జాన్ చిత్రంలోని బతుకమ్మ పాటను ఇవాళ విడుదల చేశారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. తెలుగు లిరిక్స్ హరిణి ఇవటూరి, కిన్నల్ రాజ్ రాసారు. హిందీ  లిరిక్స్ షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాసారు. 

Advertisement

Also Read :  మ‌రోసారి ట్రోల‌ర్స్ కు అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్…!

బతుకమ్మ వీడియో సాంగ్ లో బుట్టబొమ్మ పూజాహెగ్దే డ్యాన్స్ ఆకట్టుకునేవిధంగా ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా చక్కగా చేశారు. బతుకమ్మ పాట చూస్తే.. అందులో భూమిక కూడా కనిపిస్తారు. వెంకటేష్ భార్య పాత్రలో భూమిక నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పూజాహెగ్దేను హైదరాబాదీ అమ్మాయిగా చూపించనున్నారు. ఈ చిత్రంలో బతుకమ్మ పాట పెడితే బాగుంటుందని వెంకటేష్ సలహా ఇచ్చారట. ఆ ఐడియా నచ్చిన సల్మాన్ ఖాన్ పాటను పెట్టమని దర్శక, నిర్మాతలకు చెప్పారట. తెలంగాణ మహిళలకు ఈ పాటను అంకితమిస్తున్నట్టు సమాచారం. దాదాపు 200 మంది డ్యాన్సర్లు, సినిమా ప్రధాన తారాగణం పై ఈ పాటను తెరకెక్కించారు. ఏప్రిల్ 21న విడుదలయ్యే ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి మరి. 

Also Read :  ‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!

Visitors Are Also Reading