Home » రికార్డు సృష్టించిన‌ బాల‌య్య.. చెన్న‌కేశ‌వ‌రెడ్డికి భారీ క‌లెక్ష‌న్లు..!

రికార్డు సృష్టించిన‌ బాల‌య్య.. చెన్న‌కేశ‌వ‌రెడ్డికి భారీ క‌లెక్ష‌న్లు..!

by Anji
Ad

టాలీవుడ్ మాస్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో సెప్టెంబ‌ర్ 25, 2022న మ‌రోసారి విడుద‌ల చేశారు. బాల‌కృష్ణ అభిమానులు 30కి పైగా స్పెష‌ల్‌షోలు ప్లాన్ చేసుకున్నారు. అమెరికాలో సైతం ఈ సినిమా భారీగానే విడుద‌లైంది.

Also Read : గాడ్ ఫాదర్” సినిమా పోస్టర్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్….చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ…!

Advertisement

ఈ చిత్రంలో ట‌బు, శ్రియా హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌సాయి గ‌ణేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2002 సెప్టెంబ‌ర్ 25న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుద‌లై 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 24, 25 తేదీల‌లో భారీ ఎత్తున విడుద‌ల చేశారు. అమెరికాలో సుమారు 40 లొకేష‌న్ల‌లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా విడుద‌ల అయింది. ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Also Read : విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న రిలేషన్ అదేనా ? ఇదెక్కడి ట్విస్ట్ !

Advertisement

బాల‌య్య నటించిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇటీవ‌ల రీ రిలీజ్ అయిన చిరంజీవి ఘ‌రానా మొగుడు, మ‌హేష్ పోకిరి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా, రికార్డుల‌ను క‌లెక్ష‌న్లు చిత్తు చిత్తు చేశాడు. బాల‌య్య ఫ్యాన్స్ సంద‌డి మామూలుగా లేదు. అమెరికాలో చెన్న‌కేశ‌వ‌రెడ్డి 45,000 డాల‌ర్లు వ‌చ్చాయ‌ట‌. ఇది 36 లొకేష‌న్ల‌లో క‌లెక్ష‌న్లు మాత్ర‌మే. మ‌హేష్ బాబు పోకిరికి 16,000 డాల‌ర్లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సాకి 38,000 డాల‌ర్లు వ‌చ్చాయి. ఈ చిత్రంలో బాల‌య్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశారు. టైటిల్ రోల్ చెన్న‌కేశ‌వ‌రెడ్డితో పాటు భ‌ర‌త్ పాత్ర‌లో క‌నిపించారు. తండ్రి, త‌న‌యులుగా బాల‌య్య చేసిన మొద‌టి డ్యూయ‌ల్ రోల్ చిత్రం ఇదే. ఆ త‌రువాత సింహా, అధినాయ‌కుడు సినిమాల్లో తండ్రి, త‌న‌యులుగా రెండు పాత్ర‌ల్లో న‌టించారు. మొత్తానికి బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా రీ రిలీజ్ చేసిన సినిమాల్లో పెద్ద హిట్ అయింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read : అలనాటి స్టార్ హీరోయిన్ ‘సౌందర్య’ ఆ సినిమాలో చెయ్యకుండా ఎందుకు ఆపారు ? అసలు కథ ఏంటి ?

Visitors Are Also Reading