Telugu News » Blog » విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న రిలేషన్ అదేనా ? ఇదెక్కడి ట్విస్ట్ !

విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న రిలేషన్ అదేనా ? ఇదెక్కడి ట్విస్ట్ !

by AJAY
Ads

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో విజయశాంతి కూడా ఒకరు. విజయశాంతి హీరోల పక్కన జోడిగా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును విజయశాంతి సంపాదించుకున్నారు. విజయశాంతి సినిమాలకు చాలామంది అభిమానులు ఉండేవారు. ఒసేయ్ రాములమ్మ, అడవి చుక్క తో పాటు విజయశాంతి నటించిన పలువు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

అంతేకాకుండా విజయశాంతి అప్పట్లో పోలీస్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి మొద‌ట ప‌ట్టాభిషేకం సినిమాలో న‌టించారు. ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో క‌లిసి న‌టించారు. అంతే కాకుండా బ‌య‌ట కూడా వీరు స్నేహంగా ఉండేవారు. దాంతో విజయశాంతి బాలయ్యలు ప్రేమలో ఉన్నారు అంటూ కూడా అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి.

Advertisement

కానీ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. ఇక విజయశాంతి పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. విజయశాంతి రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ జంట ఎప్పుడూ మీడియా ముందు కనిపించలేదు. అయితే బాలకృష్ణకు, విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.

VIJAYASHANTHI

VIJAYASHANTHI

బాల‌య్యకు శ్రీనివాస్ ప్ర‌సాద్ ప్రాణ స్నేహితుడ‌ని టాక్. అంతేకాకుండా బాలకృష్ణ సలహా మేరకే విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి. మరోవైపు విజయశాంతి భర్తతో కలిసి ఉంటున్నారా..? వారికి పిల్లలు ఉన్నారా ..? అన్న విషయాలు మాత్రం ఎవరికి తెలియదు. ఇక విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ALSO READ :“గాడ్ ఫాదర్” సినిమా పోస్టర్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్….చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ…!