Home » “గాడ్ ఫాదర్” సినిమా పోస్టర్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్….చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ…!

“గాడ్ ఫాదర్” సినిమా పోస్టర్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్….చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన చివ‌రి చిత్రం ఆచార్య సినిమా దారుణ‌మైన ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకు కొర‌టాల శివ దర్శ‌క‌త్వం వ‌హించారు. రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాడు. దాదాపుగా సినిమాలో రామ్ చ‌ర‌ణ్ గంట‌పాటూ క‌నిపించాడు. దాంతో ఈ సినిమా పై మొద‌టి నుండి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. న‌క్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read:  2వ ప్రపంచ యుద్ధ టైంలో పెళ్లి పత్రిక ఎలా ఉందంటే..ఆ 3 పదాల అర్థమేంటబ్బా..!!

Advertisement

సినిమాలో పూజా హెగ్డే రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా న‌టించింది. ఇక అలా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఆచార్య అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో మెగాఫ్యాన్స్ నిరాశ‌చెందుతున్నారు. చిరంజీవి కెరీర్ లోనే ఈ సినిమా దారుణ‌మైన టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిరు ఈ సినిమా త‌ర‌వాత గాఢ్ ఫాద‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాంతో మెగాఫ్యాన్స్ ఆశ‌లు అన్నీ గాఢ్ ఫాద‌ర్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాకు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమా

Advertisement

Also Read:  “జబర్దస్త్” జడ్జి లు ఒక్క ఎపిసోడ్ కే అంత రెమ్యునరేషన్ అందుకున్నారా..? ఎవరెవరికి ఎంత అంటే…?

లూసీఫ‌ర్ కు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నారు. లూసీఫ‌ర్ లో హీరోయిన్ లేక‌పోవ‌డంతో గాఢ్ ఫాద‌ర్ లో కూడా హీరోయిన్ ను తీసుకోలేదు. అయితే మొద‌ట సినిమాలో హీరోయిన్ ను తీసుకోవాల‌ని అనుకున్నారు కానీ ఆ త‌ర‌వాత ఆలోచ‌నను విర‌మించుకున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఓ పోస్టర్ను విడుద‌ల చేయ‌గా నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి.

దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు ఓ బ్లండ‌ర్ మిస్టేక్ చేయ‌డ‌మే పోస్టర్ లో చిరంజీవికి ప‌క్క‌న సునీల్ తో పాటూ కొంత‌మంది జెండాలు ప‌ట్టుకుని ముందుకు న‌డుస్తుంటారు. అయితే సునీల్ చిరంజీవికి ప‌క్క‌న రైట్ సైడ్ లో క‌నిపిస్తాడు. అంతే కాకుండా జ‌నాల్లో లెఫ్ట్ సైడ్ కూడా సునీల్ క‌నిపిస్తాడు. దాంతో ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారు చూసుకోవాలి క‌దా డైరెక్ట‌ర్ గారూ అంటూ నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ : అర్ధరాత్రి 12:ఎన్టీఆర్+ జయలలిత..అమ్మ బాబోయ్ అంత పని చేశారా..?

 

Visitors Are Also Reading